విజయవాడ టాప్ అంటే ఎందులోనో అనుకున్నా.. అబ్బా..!!

August 10, 2020

కరోనా వేళ చిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. లాక్ డౌన్‌తో పాటు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ.. చాలామంది ఇలాంటి సమయాల్లో ప్రెగ్నెన్సీ వద్దని వాయిదా వేసుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే, సె.. క్స్.. టాయిస్ సేల్ విపరీతంగా పెరిగినట్లుగా కొత్త రిపోర్టు ఒకటి బయటకు వచ్చి ఆసక్తికరంగా మారింది.
లాక్ డౌన్ వేళ నిత్యవసర వస్తువులు తప్పించి మరింకేమీ కొనలేని పరిస్థితి.
అన్‌లాక్ మొదలైన వెంటనే ఆన్ లైన్ అమ్మకాలు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సె.. క్స్ టాయిస్, ఇంటర్ కోర్స్ టాయ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లుగా ఒక రిపోర్టు బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా వీటి కొనుగోలు పెరిగిందని చెప్పిన సదరు నివేదిక.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి కొనుగోళ్లు బాగా జరిగాయని వెల్లడించింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ టాయిస్ కొనుగోలు చేస్తున్న వారిలో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిలే ఎక్కువని తేలింది.
దేశంలోని చిన్న నగరాల్లో మహిళలు ఇలాంటి వాటి కోసం చేసే ఆర్డర్లు 300 శాతం పెరిగినట్లుగా తేల్చారు. ఈ టాయిస్ ఎక్కువగా ఆర్డర్ చేసే చిన్న నగరాల్లో విజయవాడ తొలి స్థానంలో నిలిచిందంటే నమ్మగలమా? కానీ.. ఇది నిజమని చెబుతోంది సదరు నివేదిక.
వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వారిలో 25-34 వయసుల వారు ఎక్కువని చెబుతున్నారు.
అంతేకాదు.. వీటిని వినియోగించేవారు మళ్లీ మళ్లీ అవే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారని.. అలాంటివారు 61 శాతం ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఈ టాయ్‌ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. తెలంగాణలోనూ వీటిని కొనుగోలు చేసేది మహిళలేనని తేల్చారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీటి కొనుగోలు కోసం పురుషులు రాత్రి తొమ్మిది నుంచి అర్థరాత్రి పన్నెండు వరకు వెతుకుతుంటే.. అమ్మాయిలు మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో వెతుకుతూ.. ఆర్డర్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు.
పురుషులు మేల్ పంప్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటే.. మహిళలు మాత్రం మసాజర్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక.. ఈ టాయిస్ వినియోగం పెళ్లి అయిన వారు కాని వారు అన్న సంబంధం లేకుండా కొనుగోలు జరుగుతుండటం గమనార్హం.
పెళ్లైన మగాళ్లు సైతం 86 శాతం మంది ఈ టాయిస్ తో ఆనందం పొందినట్లుగా చెబుతున్నారట.
వీటిని వినియోగించే మహిళల్లో ఇది 89 శాతం మంది ఆనందంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
పెళ్లి కాని అబ్బాయిల్లో వీటిని వినియోగించిన వారిలో 71 శాతం మంది ఆనందంగా ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ టాయిస్ వినియోగం విదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటిది.. దేశంలో ఈ స్థాయిలో వినియోగించటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
కరోనా వేళ.. వచ్చిన మార్పు ఈ నివేదిక కళ్లకు కట్టినట్లుగా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.