అనవసరంగా బాబును ఇరికించారే

May 24, 2020

ఒక్కోసారి చిన్న తప్పులు పెద్ద విషయాలై కూర్చుంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి ఈరోజు టీడీపీలో కలకలం రేపింది. ఎన్టీఆర్ మరణం అనంతరం ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతికు అలంకరణ చేసేది. తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నపుడు ఎవరూ చెప్పకుండానే ఈ పనులు జరిగిపోయాయి. మిగతా ప్రభుత్వాలు ఉన్నపుడు పార్టీ తరఫున ఒక లేఖ రాసి గుర్తుచేసేవారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఏడాది తెలంగాణ గవర్నమెంటుకు తెలుగుదేశం తెలంగాణ శాఖ లేఖ ఇచ్చేది. ఈసారి కూడా తెలంగాణ శాఖ లేఖ ఇచ్చింది.
ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇలాంటి వ్యవహారాలు చూసే విభాగంలో కొందరు దీనిని ఉద్దేశ పూర్వకంగా పట్టించుకోకుండా ఉండి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో జయంతి రోజు ఘాట్ వద్ద ఏ అలంకరణ లేక బోసిపోయింది. ఏదైతేనేం... జాతీయ స్థాయిలో ముఖ్యపాత్ర పోషించిన ఓ తెలుగు వాడికి, పేదలు, బడుగుల సంక్షేమానికి పునాది వేసిన ఓ మహానుభావుడికి అవమానం జరిగింది. జనరల్ ప్రతి ఏడాది ఆటోమేటిగ్గా జరిగిపోయే ఈ సంప్రదాయం గురించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అలెర్ట్ గా లేరు. దీంతో ఉదయాన్నే అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈ విషయం మీడియాలో ప్రసారం అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆరా తీయగా... తెలంగాణ టీడీపీ లేఖ ఇచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయం పట్టించుకోలేదని తేలింది. తెదేపా వ్యవస్థాపకులు, దివంగత నందమూరి తారకరామారావు జయంతికి, వర్దంతికి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ను గతేడాది తెలంగాణ ప్రభుత్వమే ఘాట్‌ వద్ద అలంకరణ ఏర్పాట్లు చేసిందని బాబు గుర్తుచేశారు. తెలంగాణ తెదేపా నుంచి ప్రభుత్వానికి ఈసారి కూడా లేఖ ఇచ్చారని తెలిపారు. గతేడాది మాదిరిగానే చేస్తారని తెలంగాణ తెదేపా భావించిందన్నారు. ఒక వేళ చేయని పక్షంలో గవర్నమెంటు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.
గవర్నమెంటు పట్టించుకన్నా, పట్టించుకోకపోయినా ఇది మళ్లీ పునరావృతం కారాదని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వానికి ముందుగా తెలియజేయాలి. వాళ్లు చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా అలంకరణ చేయాలని చంద్రబాబు సూచించారు. ఇలాంటి అంశాల్లో ఎప్పుడూ సమాచార లోపం ఉండరాదని హెచ్చరించారు. ఈ చిన్న పని అనవసరంగా పార్టీలో కలకలం రేపింది.