కేసీఆర్ డిజాస్టర్ నిర్ణయం... ఇండియా మొత్తం షాక్

August 05, 2020

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మారథాన్ ప్రెస్మీట్లతో తెలుగు రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో కూడా ఆహా ఓహో అనిపించుకున్నారు. బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్నాడు కేసీఆర్. పదివేల కోట్లు ఖర్చయినా పెడతాడట, కరోనా అంతు చూస్తారట.... వారెవ్వా అని అందరూ పొగిడారు. తీరా లాక్ డౌన్ ప్రభుత్వం డొల్లతనం, అసమర్థత బయటపడింది. 

ఆ షాకు నుంచే కోలుకోని జనానికి కేసీఆర్ సర్కారు తాజాగా భారీ షాక్ ఇచ్చింది. రెండో రోజులు శాంపిల్స్ ఏవీ సేకరించరట. అదేంటి అసలు టెస్టులు చేస్తున్నదే తక్కువ. అవి కూడా ఆపేస్తారా? దేశంలోనే అతి తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం కదా మనది.. అందులోను మళ్లీ వెనుకబాటా అంటూ అందరూ షాక్ కు గురవుతున్నారు. శాంపిల్స్ సేకరణకు తెలంగాణ ఎందుకు బ్రేక్ ఇచ్చిందంటే... ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ ఫలితాలు రావడానికి రెండ్రోజులు టైం కావాలంట, అందుకని ఆపేశారట.  ఇంత హాస్యాస్పదమైన నిర్ణయమా అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. జనం గవర్నమెంట్ ను ట్రోల్ చేస్తున్నారు.

దేశంలోనే ఉన్నత వైద్య సదుపాయాలున్న తెలంగాణలో ఇదేం దరిద్రం అని ఆశ్చర్యపోతున్నారు. మార్చిలో ప్రకటించిన టిమ్స్ ఆస్పత్రికి ఇంకా సిబ్బంది ఎంపిక చేయడం ఏంటి? మరీ ఇంత అలసత్వం అయితే... ప్రభుత్వం ఈ సమస్యను ఎపుడు అధిగమిస్తుంది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అసలు టెస్టులు చేయడానికి కూడా హైకోర్టు, కేంద్రం, ప్రజలు విపరీతంగా ఒత్తిడి తెస్తే గాని ప్రభుత్వం ముందుకు రాలేదు. పైగా జనం తమంతట తాము టెస్టులు చేయించుకుంటాం అంటున్నా... లక్షణాలు లేకుండా టెస్టులు చేయొద్దని ల్యాబ్ లకు చెబుతోంది. ఇదేం విచిత్రమైన ఆదేశమో వారికే తెలియాలి. జనం టెస్టులు చేయించుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి?

తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా అవార్డు ఏమైనా ఇస్తారా? అమెరికా వంటి దేశమే అతలాకుతలం అవుతుంటే... హైదరాబాదు లో లేదు లేదు, లేనే లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? కచ్చితంగా దాచిపెట్టారు అనే అంటారు. ఎందుకంటే ప్రపంచమంతా వచ్చిన కరోనా హైదరాబాదులో రాకుండాపోతుందా? అయినా దాచిపెట్టి ఏం సాధిస్తారు? పెట్టుబడులు కోసం చేయాల్సింది ఇదేనా? ప్రజారోగ్యం విషయంలో ఇలాంటి అసందర్భ నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది.

మొన్న విడుదలైన పిక్సల్స్ సర్వే  ప్రకారం కరోనా సామాజిక వ్యాప్తి దేశంలోనే అత్యధికంగా ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంది. స్వయంగా కేంద్ర హోం మంత్రి  కిషన్ రెడ్డి ఒవైసీ ఒత్తిడి వల్లే టెస్టులు చేయలేదన్నారు. ఇంతకాలం టెస్టులు చేసి ట్రీట్ చేయలేదు కాబట్టే అసింప్టమాటిక్ కేసులన్నీ నగరంలో కరోనాను విపరీతంగా పెంచాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కరోనా ఉంది. హైదరాబాదులో ఒక్కటే 6 వేల కేసులు దాటాయి. తెలంగాణలో 10 వేలు దాటాయి. ముందే మేల్కొని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. 

తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల కొత్త పెట్టుబడుల సంగతి పక్కన పెడితే హైదరాబాదులో ఉన్న సంస్థలు, వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసుకునే పరిస్థితి ఏర్పడింది.