ఈయన ఎవరో గాని కేసీఆర్ ని భలే ఇరికించాడు

February 26, 2020

ప్రజలకు సేవ చేయడంలో తానంత సుద్ధపూస ఈ దేశంలోనే లేనట్టు చెబుతుంటారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రజలకోసమే తన పానం అంటాడు. ఎవరెవరి మీదనో నిందలేస్తాడు. కానీ... ఎవరూ పెద్దగా ఆలోచించని ఖరీదైన తప్పులు చేస్తారు. అది ఎవరికోసం ఎందుకోసం చేస్తున్నారో తెలియకుండా జాగ్రత్త పడతాడు. గత ఆరేళ్లుగా ఈ దాపరికంలో పీహెచ్ డీ చేసిన కేసీఆర్ అసలు రంగును బట్టబయలు చేశాడు ఓ తెలంగాణ నేత, పౌరుడు. 

పేరాల శేఖర్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. అయినా అతను తెలంగాణలో అందరికీ సుపరిచితం ఏమీ కాదు. లో ప్రొఫైల్ నేత. అయితే, ఆయన కేసీఆర్ బండారాన్ని బయటపెట్టడం ద్వారా ఇపుడు తెలంగాణలో మారుమోగిపోతున్నాడు. ఆర్టీఐ పిటిషన్ల ద్వారా కేసీఆర్ గుట్టు కనిపెట్టి హైకోర్టుకు వెళ్లి... కేసీఆర్ సర్కారు చేస్తున్న మాయను కనిపెట్టారు. దానిని హైకోర్టుకు వివరించి కేసీఆర్ గుట్టు ప్రపంచానికి తెలిసేలా చేశారు. అదే జీవోల గుట్టు. గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష నాలుగు వేల జీవోలు విడుదల చేసిందట. అందులో సగానికి పైగా జీవోలను కేసీఆర్ సర్కారు దాచిపెట్టింది. అంటే... ప్రజలకు తెలియనీయకుండా తనవద్ద అట్టిపెట్టుకుంది. కేవలం కొన్నిటినిమాత్రమే ఆన్ లైన్లో ప్రజలకు తెలిసేలా పెట్టింది. ఎందుకిలా జరుగుతోందని ఆరా తీసిన పేరాల శేఖర్ మొత్తం గుట్టును లాగేశాడు. హైకోర్టు కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆ జీవోలన్నీ ప్రజలకు చూపించండి అని ఆదేశించింది. ఇది నిన్నటి కథ. 

తాజా కథ ఏంటంటే.. దాచిపెట్టిన జీవోలన్నీ ఖరీదైనవే, ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టేవన్న విషయాన్ని పేరాల వెల్లడించారు. 6 లక్షల కోట్ల విలువైన జీవోలను దాచారట. కొత్త కలెక్టర్ ఆఫీసు నిర్మాణ జీవోలు, కాళేశ్వరం జీవోలు, భగీరథ జీవోలు వంటివన్నీ దాచేశారు. చిత్రమైన విషయం ఏంటంటే... ఈ ప్రాజెక్టుల చుట్టూ అనేక వివాదాలు, విమర్శలు ఉన్నాయి. అలాంటి వాటిని ఎందుకు దాచారో అర్థం కాని పరిస్థితి. 35 శాతం జీవోలను రహస్యంగా ఉంచగా... వాటి విలువు 6 లక్షల కోట్లు. ప్రభుత్వ అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు ఈ జీవోలను దాచారన్నది పేరాల శేఖర్ ఆరోపణ. కేసీఆర్  సామాన్యుడు కాదు బాబోయ్.