కేసీఆర్ సర్కారుకు హైకోర్టు సీరియస్ వార్నింగ్

August 08, 2020

తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ -19 మేనేజ్ మెంట్ తీవ్రంగా విఫలం అయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు కూడా దాదాపు చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు టిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. మీరు జీవించే హక్కును కాలరాస్తున్నారని మండిపడింది. 

కొన్ని రోజులు పరీక్షలను నిలిపివేసినందుకు ఆశ్చర్యపోయింది. వారాంతంలో, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సాంకేతిక సమస్యలను పేర్కొంటూ కోవిడ్ టెస్టులు  చేయలేదు. మంగళవారం నుండి తిరిగి ప్రారంభించింది.
 "పిహెచ్ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు ఐసిఎంఆర్ మార్గదర్శకాలకు విరుద్ధం" అని కోర్టు టెస్టులు ఆపడంపై వ్యాఖ్యానించింది. గత 30 రోజులలో చేసిన పరీక్షల వివరాలను, ప్రైమరీ సెకండరీ కాంటాక్టుల వివరాలను, హైదరాబాద్లో కేంద్ర బృందం పర్యటన వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో పలుమార్లు కోర్టు చేసిన సూచనలను కొన్ని సార్లు విస్మరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తిచేసింది హైకోర్టు ధర్మాసనం. పది నిమిషాల్లే ఫలితాలు వచ్చే టెస్టులు చేయమని చెబితే ఇంతవరకు ఎందుకు చేయలేదని కోర్టు ప్రశ్నించింది.

హెల్త్ బులెటిన్‌లో ఇస్తున్న వివరాలు సమగ్రంగా లేవు అని పేర్కొంది. ఇప్పటివరకు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి జూలై 17 వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఈసారి ఆదేశాల అమలులో విఫలమైతే,  ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య, మునిసిపల్ కార్యదర్శులు మరియు జిహెచ్ఎంసి కమిషనర్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చింది.