తెలంగాణ హోం మంత్రికి కరోనా.. ఇదీ రీజన్

July 12, 2020

టీఆర్ఎస్ నేత, తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా సోకింది. అధికారికంగా దీనిని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల మంత్రికి చెందిన కొందరు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. వారి ద్వారా ఆయనకు సోకినట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయగా కరోనా బయటపడింది. 

ఆందోళన కరం ఏంటంటే...  మహమూద్ అలీకి ఆస్తమా కూడా ఉంది. కాబట్టి కరోనా ఆయనకు కొంచెం ప్రమాదకరం.  

మంత్రి నిర్లక్ష్యం వలే ఇలాజరిగిందంటున్నారు తోటి వారు. తన గన్‌మెన్‌కి కరోనా పాజిటివ్ అని తేలినా హోంమంత్రి క్వారంటైన్ అవ్వలేదు. తర్వాత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఆయన వెంట ఉన్నారు.

ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ నేతలకు కరోనా సోకింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు కూడా కరోనా సోకింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ ‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ లు కోలుకుంటున్నారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Read Also

హైదరాబాదు ఖాళీ - కొన్ని కఠిన నిజాలు
కేసీఆర్ సంచలనం - GHMC లో కఠిన లాక్ డౌన్
వివేకానంద రెడ్డి కూతురు సునీత మాటలు విన్నారా?