తిరుగులేని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ !

June 05, 2020

ప్రపంచంలోని అనేక అనుభవాల వల్ల కరోనా ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిని కట్టడి చేయకపోతే అది మనందరినీ నలిపేస్తుందని ప్రజలందరూ అర్థం చేసుకుని సహకరించాలని ఇటలే తప్పే మనకు మేల్కొలుపు కావాలని కేసీఆర్ విజ్జప్తి చేశారు. తెలంగాణను ఈనెల 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాయంత్రం 5 గంటలు చప్పట్ల ద్వారా వైద్యులకు, ఇతర అత్యవసర సర్వీసులు అందించే వారికి కృతజ్జతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. 

’కరోనా విజృంభణ దారుణంగా ఉంది. ఒక్క రోజే ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాం‘ అని కేసీఆర్ చెప్పారు. ఎవరింటికి వారు పరిమితం కావాలి. జనతా కర్ఫ్యూలో గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించారు. దానిని కొనసాగించాలి.  ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దు. దీనిని మీరితే పోలీసులు జోక్యం చేసుకుంటారు అంటూ కేసీఆర్ హెచ్చరించారు.

అత్యవసర, నిత్యవసర స్తువుల కొరత లేదు. కుటుంబానికి ఒక్కరిని మాత్రమే అందుకు బయటికి అనుమతిస్తాం. మీకు మీరే తెలుసుకోండి. అర్థం చేసుకోండి. వివేకంతో ఉండాల్సిన సమయం ఇది. పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరిపడా నిత్యావసరాలు అందిస్తాం. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తాం. ఇతర పప్పు, ఉప్పుల కోసం రూ.1500 నగదు ఇస్తాం. 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆఫీసులకు రావద్దు. గవర్నమెంటు ఆదేసించిన విభాగాల వారు మాత్రమే హాజరు కావాలి అని కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా వైద్య విభాగం, విద్యుత్ శాఖ  వంటి  అత్యవసర సర్వీసులు ఉద్యోగులకు సెలవులు లేవు.  పరీక్షలన్నీ రద్దు. పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా ఆపేస్తున్నాం. మార్చి 31వ తర్వాత తదుపరి పరిణామాలపై అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అని కేసీఆర్ తెలిపారు.  

కేంద్రం తెలంగాణలోని 8 జిల్లాలను మాత్రమే లాక్ డౌన్ చేయాలని రాష్ట్రానికి ఆదేశించింది. అయితే... కేసీఆర్ ముందు జాగ్రత్తగా మొత్తం రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేశారు.