కేసీఆర్ ఉలిక్కిపడే ఆరోపణ !

August 07, 2020

కోవిడ్ లో ప్రైవేటు ఆస్పత్రుల వేధింపులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి వైద్య సదుపాయాలపై ఉండాలి. కానీ తెలంగాణలో పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. ఒకవైపు జనం ఆస్పత్రుల్లో బెడ్లు లేక బాధపడుతుంటే... ముఖ్యమంత్రి కనిపించడం లేదు. కానీ ఆయన కల కోసం అధికారులు తపిస్తున్నారు. బ్రహ్మాండంగా పనికొచ్చే సచివాలయం కూల్చి కొత్త సచివాలయానికి స్థలం సిద్ధం చేస్తున్నారు. 500 కోట్లు ఖర్చు పెట్టి భవంతనిని నిర్మించడానికి కేసీఆర్ ప్లాన్ రెడీ చేశారు. కొత్త భవనం ఎలా ఉండబోతోందో... ఒక ఊహా చిత్రం విడుదల చేశారు.

దీనిపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ తెలంగాణ 8వ నిజాం అని మేము చెబుతున్నది నిజం అని కేసీఆరే నిరూపించుకుంటున్నారు. అందుకే కొత్త సచివాలయ భవనాన్ని మసీదు ఆకారంలో కట్టడానికి ప్లాన్ చేశారు అంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కొత్త బిల్డింగ్ ప్లాన్ ఉత్తరప్రదేశ్ లోని హజ్ హౌస్ రూపంలో ఉందన్నారు. ఈ మేరకు హజ్ హౌస్ చిత్రాన్ని తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనం ప్లాన్ ను పోల్చి చూపించారు. ఆ పోలిక చిత్రాలను తన ట్విట్టరులో షేర్ చేశారు.

రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి కొత్త అస్త్రాన్ని ఇచ్చారు. దీనిని బీజేపీ గట్టిగా వాడుతుందనడంలో సందేహమే లేదు. మొత్తానికి కేసీఆర్ కు రాజాసింగ్ ఆరోపణ నిద్ర పట్టకుండా చేసిందని చెప్పొచ్చు.