కేసీఆర్ థాంక్యూ.. తెలుగు ప్రజలకు భారీ గుడ్ న్యూస్

August 07, 2020

తెలంగాణలో లాక్ డౌన్ పొడగించారు. పాస్ ల విధానాన్ని ఎత్తేశారు. 70 రోజుల అనంతరం స్వతంత్రం లభించిన ఫీలింగ్. తెలంగాణలో పాస్ ల విధానం ఎత్తేస్తూ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణకు ఎవరైనా ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు. తెలంగాణకు రావడానికి ఎటువంటి పాసూ అవసరం లేదు. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మే 22 నుంచి తెలంగాణకు రాక పోకలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తేశారు. మధ్యలో అవసరమైన వారందరికీ పాసులు ఇచ్చారు. ఇక నుంచి తెలంగాణకు రావడానికి ఏ పాసూ అవసరం లేదు. ఎవరైనా రావచ్చు. ఎవరైనా పోవచ్చు. 

కేంద్రం జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5 ప్రకటించింది. అయితే ఇది కేవలం కంటైన్ మెంట్ జోన్ కే పరిమితం చేసింది. తెలంగాణ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. జూన్ 30 వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించింది. మిగతా ప్రాంతాల్లో భారీ సడలింపులు ఇచ్చారు. తెలంగాణలో రాత్రి 8వరకు ఇక దుకాణాలు తెరుచుకోవచ్చు. అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు. వీటితో పాటు కేంద్రం ఇచ్చిన అన్ని సడలింపులు తెలంగాణ కూడా ఇవ్వనుంది.