​సొంతూరికి పాస్ ...  నిమిషాల్లో పోటెత్తిన లక్షల రిక్వెస్ట్ లు.. ​

August 05, 2020

కార్మికులు, టూరిస్టులే కాకుండా సొంతూరి వెళ్లాలనుకున్న వారందరినీ అనుమతించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు పాసులు జారీ చేస్తామని ప్రకటించింది. ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలతో కూడిన వెబ్ సైటును తెలంగాణ డీజీపీ తన ట్విట్టరులో పోస్ట్ చేశారు. ఆ ప్రకటన వచ్చిన వెంటనే మీడియాల్లో ప్రసారం అయ్యింది. దీంతో దరఖాస్తులు పోటెత్తాయి. ఒకేసారి ట్రాఫిక్ పెరిగిపోవడంతో వెబ్ సైట్ స్ట్రక్ అయ్యింది. చాలామందికి ఓపెన్ కాలేదు. దీంతో  దెబ్బకు వెబ్ సైటును ఆపేశారు. అయితే తాత్కాలికంగా మాత్రమే ఆపేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా గంటల్లోనే పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రెండు గంటల్లో 17 వేల పాసుల రిక్వెస్టులు వచ్చాయి. అయితే అప్పటికి ఇంకా ఈ సమాచారం చాలా మందికి తెలియదు. మళ్లీ సైటు ఓపెన్ చేస్తే ఇవి లక్షల్లోకి చేరుకుంటాయి. 

ఎవరికీ పాసులు...

ఈ పాసులు వాహనం ఉన్న ఎవరికైనా ఇస్తారు. ఇప్పటికే కార్మికులకు, కూలీలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని పంపిస్తోంది. ఇక చాలా మంది సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా సొంతూరికి వెళ్లాలి అనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పాసులు తెలంగాణ సరిహద్దుల వరకే కాకుండా వారి సొంతూరు చేరేదాకా ఉపయోగపడతాయి. వాహనం ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అద్దె వాహనాలను కూడా లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా అనుమతిస్తారు.  

Telangana DGP note: 

Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.

https://tsp.koopid.ai/epass

 

After due verification ur E-PASS will b sent to u,to move ahead.