తెలంగాణ.... కరోనా విశ్వరూపం, నీ ప్రాణం నీ ఇష్టం

August 07, 2020

ముఖ్యమంత్రి కేసీఆర్...

మార్చి మొదటి వారంలో అదసలు పెద్ద రోగమే కాదన్నారు, మనకు రాదన్నారు

మార్చి చివరి వారంలో వచ్చింది. కానీ ఏప్రిల్ ఏడు కల్లా తెలంగాణ కరోనా ఫ్రీ అన్నారు

ఏప్రిల్ మొదటి వారంలో బతికుంటే బలుసాకు తిందాం, కాలు బయటపెట్టొద్దన్నాడు

మే మొదటి వారం... లాక్ డౌన్ మాత్రమే మనకు ఆయుధం అన్నాడు

మే చివరి వారంలో.... దాని పని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకుందాం అన్నాడు

జూన్ మొదటి వారం...

ఏం చేయాలో అర్థం కావడం లేదు. పరిస్థితి చేయి దాటింది. కేసుల ట్రేసింగ్ కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. అసలు గవర్నమెంటుకే తెలియని కేసులు అనేకం. టెస్టులు చాలా తక్కువ. చేసిన టెస్టుల్లో పది శాతం కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది

ట్రాఫిక్ వాళ్ల కోసం ఏదో ఒక హెల్మెట్ పెట్టుకున్నట్టు... 

కరోనా ఫీలవుతుందేమో అని ఒక మాస్కు పెట్టుకుని దానిని మెడ కిందకు లాగుతున్నారు జనం. ఇక్కడ గవర్నమెంటు తప్పు ఎంతుందో ప్రజల తప్పు అంతకంటే ఎక్కువుంది. ప్రజలకు పోతే డబ్బే పోతుంది. కానీ ప్రజలకు ప్రాణాలే పోతాయి. అందుకే ప్రభుత్వం కోసం కాకుండా మీ కోసం మీరు జాగ్రత్తగా ఉండండి.

తెలంగాణలో వ్యాప్తి ఎంత ప్రమాదకరంగా ఉందో ఈరోజు లెక్కలు చూస్తే అర్థమవుతుంది

శనివారం, జూన్ 6 నమోదైన కేసులు 206

మొత్తం కేసులు - 3496

ఈరోజు మరణాలు - 10

మొత్తం మరణాలు - 123

206 కేసుల్లో 152 మాత్రమే జీహెచ్ఎంసీ... 54 కేసులు జిల్లాల నుంచే వచ్చాయి. దీన్ని బట్టి తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తుందనడానికి ఇది ఉదాహరణ మాత్రమే. జనం తమంతట తాము గవర్నమెంటుకు చెప్పకుండా దాచిన కేసులు కోకొల్లలు