తెలంగాణ కేసుల కొత్త రికార్డు

July 03, 2020

తెలంగాణలో కేసులు 3 వేలు దాటాయి. పరిస్థితి విషమిస్తోంది. మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. తాజాగా ఈరోజు తెలంగాణలో 129 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3020కి చేరింది. మృతుల సంఖ్య 99కి చేరింది. 1365 యాక్టివ్ కేసులున్నాయి.

అమ్మో ఇన్ని కేసులా అని కంగారు పడకండి. వాస్తవానికి ప్రభుత్వం గుర్తించని కేసులు చాలా ఉన్నాయి. 90 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో దేశంలో తగిన సంఖ్యలో పరీక్షలు జరగడం లేదు. అందుకే కేసులు సరిగా బయటపడటం లేదు. కనిపించే సంఖ్యకు ఎన్నో రెట్లు దేశంలో కేసులున్నాయి. ఒక అంచనా ప్రకారం... తెలంగాణ రోజుకు 2 వేల మందికి పైగా ఇన్ ఫెక్ట్ అవుతున్నా ఆశ్చర్యం లేదు. ఇందులో ప్రభుత్వాన్ని నిందించాల్సి పని కూడా లేదు.

ఎందుకంటే ఈ వ్యాధి వ్యాప్తికి కారణం సాధారణ ప్రజలే కాని ప్రభుత్వం కాదు. ప్రజలు భౌతిక దూరానికి ఇంకా అలవాటు పడటం లేదు. మాస్కుల విషయంలో జాగ్రత్త లేదు. అందుకే కేసులు ఎన్నొచ్చాయనే అంశం కన్నా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామన్నదే ముఖ్యం. పరిస్థితి దారుణంగా ఉంది. అయితే... మనం తప్పించుకోవచ్చు. మాస్కు, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరమే మన ఆయుధాలు.