అందరికీ శుభవార్త... రెడీగా ఉండండి

December 07, 2019

ఎటు చూసినా నీరే. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రాజెక్టులను ఇట్టే నింపేస్తోంది. ఈసారి కాలువల కింద మూడు పంటలు గ్యారంటీ. భూగర్భజలాల శాతం కూడా బాగా పెరిగింది. ప్రతి అడవి పర్యాటక ప్రాంతం అయ్యింది. సుమారు 5-6 జలపాతాలు చూడటానికి అందుబాటులోకి వచ్చాయి.
ఇంకో రెండో రోజుల్లో నాగార్జున సాగర్ పూర్తిగా నిండనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పులించితల తప్ప అన్ని ప్రాజెక్టులు నిండనున్నాయి. ఇప్పటికే జలపాతాలకు, సోమశిల రిసార్టుల వద్దకు, శ్రీశైలం ప్రాజెక్టులకు పర్యాటకులు కిటకిటాలడుతున్నారు.
ఇపుడు వారికి ఇంకో గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కొండల మధ్యలో నుంచి సాగే లాంచ్ యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్‌కు నాలుగుగైదు రోజుల్లో నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జలాశయం అందాల్ని తిలకించడం, చక్కటి అనుభూతిని పంచే లాంచ్ యాత్రను ఎంజాయ్ చేయడానికి తెలంగాణ, ఆంధ్ర పర్యాటకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కల రెండు రోజుల్లో తీరనుంది.  

Read Also

కేసీఆర్‌తో ఇక ఢీ అంటే ఢీ
కశ్మీర్ టు తెలంగాణ - బీజేపీ వ్యూహం
ఆయనే కాంగ్రెస్ కు రాజీనామా... ఊహించగలమా ఇది?