తెలంగాణ‌కు ఆరు రాజ‌ధానులు..కేసీఆర్‌-జ‌గ‌న్ భేటీలో కీల‌క నిర్ణ‌యం?

July 12, 2020

ఓ వైపు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌స్తుత రాజ‌ధాని అమ‌రావ‌తిని తొల‌గించి మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే ప్ర‌తిపాద‌న కొన‌సాగుతుండ‌గానే...మ‌రోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ‌కు ఆరు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా.. సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.
అయితే, ఈ ఇద్ద‌రి భేటీలో రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి చ‌ర్చ వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఆ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా ఇద్దరు సీఎంలు  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దాదాపు ఆరు గంటలపాటు విభజన సమస్యలు సహా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అమరావతి నుంచి రాజధానిని వైజాగ్‌కు తరలించ‌డం వ‌ల్ల వ‌చ్చే ఫ‌లితాల గురించి సైతం తీవ్రంగా చ‌ర్చ జ‌రిగినట్లు తెలుస్తోంది.
కాగా,  ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంతో పాటు అందుకు సంబంధించి భూములు కొనుగోలు చేసిన ప్రముఖుల పేర్లను అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి చేసిన ప్రకటనలపై కూడా చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి పక్కా రికార్డులతో కూడిన ఆధారాలుంటే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, అలా తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఏపీ రాజ‌ధానిని మూడు ముక్క‌లు  చేసే విష‌యం గురించి చ‌ర్చించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌...13 జిల్లాలు ఉన్న రాష్ట్రానికి ఈ ర‌క‌మైన స‌ల‌హాలు ఇచ్చిన‌పుడు త‌న 33 జిల్లాల రాష్ట్రానికి 6 రాజ‌ధానులు చేస్తారా? ఆ చివ‌ర ఉన్న ఆదిలాబాద్‌, వెనుక‌బ‌డిన పాల‌మూరు అభివృద్ధికి కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు క‌దా? అంటూ నెట్టింట కామెంట్లు వ‌స్తున్నాయి.

Read Also

సొంత గుర్తింపు కోసం అల్లు వారి తాప‌త్ర‌యం ?
క్లీవేజ్ నిధి... మెరిసింది మళ్లీ !!
సెక్సీ డ్రెస్ లో సమంత !!