సీఎంలకి కరోనా రాదా? కొరటాల బుక్కయ్యాడా, బుక్ చేశాడా?

August 07, 2020

హెడ్డింగ్ ని తప్పుగా అర్థం చేసుకోకండి.

సీఎంలకు కరోనా రావాలని కాదు..

ఈరోజు పాపం కొరటాల నాలుగు మంచి మాటలు చెప్పబోయి బుక్కయ్యారు.

ఆయన ట్విట్టరును ఫాలో అవుతున్నట్టు లేరు ఈ మధ్య. 

ట్రెండ్ ఏంటో తెలుసుకోకుండా ఒక ట్వీట్ వేశారు

అడ్డంగా బుక్కయిపోయారు.

(కొందరు కావాలనే కొరటాల అలి చేసి ఉండొచ్చు కదా అన్న అనుమాన్ని కూడా వ్యక్తంచేశారనుకోండి)

ఇంతకీ కొరటాల ఏమన్నారు ట్వీట్ లో :

ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మాస్క్ వాడుతున్నారు. 

మాస్క్ వాడితేనే కరోనాని నివారించగలం అని చెప్పారు.

మన ప్రధాని మోడీ కూడా పదేపదే చెప్పారు. 

ఆయన ఏదో ఒక తువ్వాలైన పెట్టుకుని మాట్లాడతారు

కానీ తెలుగు సీఎంలు మాత్రం మాస్క్ పెట్టుకోవడం లేదు

అది మొహమాటమో, సిగ్గో, ఇబ్బందో, ధైర్యమో... లెక్కలేని తనమో 

కారణం మాత్రం అర్థం కావడం లేదు.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో తెలుగు ముఖ్యమంత్రులపై భారీ ట్రోల్ నడుస్తోంది. అయినా ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదు. మాస్క్ పెట్టుకోవడం లేదు. కొరటాల ట్వీట్ వేస్తే సుమారు 15 వేల లైకులు వచ్చాయి. 3 వేలకు పైగా కామెంట్లు చేస్తే... ఆ కామెంట్లన్నీ జగన్, కేసీఆర్లపై సెటైర్లే.

పలువురు నెటిజన్లు జగన్ మాస్క్ లేకుండా తిరుగుతున్న ఫొటోలు పెట్టి జగనన్నా నీకే చెప్పేది విన్నావా అంటూ కొరటాల ట్వీటు కింద కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు కాస్త వ్యంగంగా సమాధానాలు ఇస్తున్నారు. మొత్తానికి రిప్లైలు చూశాకా... ఈ పోస్టు ఎందుకు పెట్టానా అని కొరటాల కంగారు పడేలా ఉన్నాయి ఒక్కోటీ. పనికట్టుకుని ముఖ్యమంత్రులను కొరటాల తిట్టించాడని... ఇండస్ట్రీ నుంచి టాక్. 

ఇది వాట్సప్ లోను తెగ వైరల్ అవుతోంది.