ఆ ముగ్గురి గూడుపుఠానీ... ఏపీ గురించా? బాబు గురించా?

July 07, 2020

ఒక గవర్నర్ పదేళ్ల పాటు అధికారంలో ఉండటం విచిత్రం అయితే... అతన్ని రెండు కీలక పార్టీలు తమ మనిషిగా భావించడం మరో ఎత్తు. కాంగ్రెస్ చేత నియమించిబడిన గవర్నర్ నరసింహన్ బీజేపీ ప్రభుత్వం రాగానే దిగిపోతాడని అందరూ అనుకున్నారు. ఒక్క నరసింహన్ తప్ప అందరూ రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. కానీ నరసింహన్ ను మాత్రం బీజేపీ వాళ్లు రాజీనామా అడక్కపోగా తమ ఏజెంట్ వాడుకున్నారని ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. నిత్యం పూజలు చేయడం వల్ల ఆయన హిందుత్వ భావజాలంతో బీజేపీ కనెక్టవడమే కాకుండా బీజేపీ పెద్దలకు నరసింహన్ సరెండర్ కావడం కూడా ఒక కారణం కావచ్చు. ఇదంతా చరిత్ర.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కీలక ఘటన జరిగింది. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అయితే, దీనిపై కలయికకు ముందు అధికారిక సమాచారం లేదు. ఇది ఆకస్మిక బేటీ. శ‌నివారం అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ వెళ్లిన జ‌గ‌న్‌... ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ వ‌ద్ద‌కు వెళ్లారు. కాసేప‌టికే కేసీఆర్ కూడా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇద్ద‌రు సీఎంలు, గ‌వ‌ర్న‌ర్ బేటీ అందరిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
ఇది ఇరు రాష్ట్రాల మ‌ధ్య నెలకొన్న వివాదాల‌పై చర్చ అని, ప్ర‌ధానంగా 9, 10 షెడ్యూల్ సంస్థ‌ల విభ‌జ‌న‌పై నెల‌కొన్న ప్ర‌తిష్ఠంభ‌న‌ను తొల‌గించే దిశ‌గా ఎలా ముందుకు సాగాల‌న్న విష‌యంపై దృష్టిసారించామని చెబుతున్నా... తెలుగుదేశం పార్టీ అధినేతపై అనుసరించిన వ్యూహాలు, అమరావతి, పోలవరం విషయంలో బాబుకు క్రెడిట్ రాకుండా ఎలా వ్యవహరించాలి... రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల అనుసరించి వ్యూహాలపై చర్చ జరిగినట్లు పలువురు ప్రచారం చేస్తున్నారు. మరి ఏది నిజమో ఆ ముగ్గురికి, వారిని నడిపించే మోడీ షాలకు తప్ప ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు.
వాస్తవానికి ఈ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంత ప్రయత్నించినా కేసీఆర్ అడుగు ముందుకు వేయలేదు. పైగా విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేదు. ఏపీకి సహకరించాలన్న దృక్పథమే ఉంటే ఆరోజే కేసీఆర్ ఏపీకి సహకరించేవారు. కానీ ఎంతసేపు బాబు అడ్డులేకుండా చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ పరిాపాలన సాగింది. వీరెన్ని వ్యూహాలు చేసినా 40 శాతం ప్రజలు టీడీపీ వైపు ఉండటం బీజేపీ టీంకు మింగుడు పడటం లేదు.