NRI : టాప్ బిజినెస్ వుమెన్‌తో సెమినార్

August 10, 2020

తెలుగు ఎంటర్‌ప్రెన్యూయర్స్ అసోసియేషన్(TEA) ఆధ్వర్యంలో శనివారం, జూలై 25, 2020 మధ్యాహ్నం గం.11కు జూమ్ వెబినార్ ద్వారా 'వుమెన్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ అండ్ ఎంపవర్‌మెంట్' సెమినార్‌ని నిర్వహిస్తున్నారు. అమెరికా, భారత్‌ లకు చెందిన పలువురు సక్సెస్‌ఫుల్ వుమెన్, లీడర్స్ ఈ సెమినార్‌లో పాల్గొంటున్నారు.

ఇందులో పాల్గొనేందుకు మరికొన్ని స్పాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరగా లాగిన్ అయి సెమినార్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకోవచ్చు. ఈ సమావేశం కోసం జూమ్ ఐడీ: 951 1412 4278. పాస్‌వర్డ్ 2020. ఈ-మెయిల్ TEA.Dallas2020@gmail.com. మరిన్ని వివరాల కోసం 817 808 3443, 408 516 6095, 972 365 4648, 972 767 9791 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

ఈ సెమినార్‌లో బెథ్ వాండ్యూనే, వాణీ కోలా, ఝాన్సీ రెడ్డి  వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు. బెథ్ వాండ్యూనే ప్రొఫెషనల్ బిజినెస్ వుమెన్. టెక్సాస్ ఇర్వింగ్ పట్టణానికి 2011 నుండి 2017 వరకు తొలి మహిళా మేయర్‌గా ఉన్నారు. ఈమె రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు. 2017లో ట్రంప్ అడ్మినిస్టేషన్ ఈమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. TX-24 ప్రస్తుత కాంగ్రెస్‌మన్ కెన్నీ మర్చంట్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వాండ్యూనేను అభ్యర్థిగా ప్రకటించారు.

వాణీ కోలా స్టార్టప్స్ పెట్టుబడిదారు. కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తారు. సిలికాన్ వ్యాలీలో వరుసగా వరుస సక్సెస్‌లు చూశారు. ఇండియాలో ఎంటర్‌ప్రెన్యూయర్స్ ఇంకా ఆదిలోనే ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె ఇటువైపు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఈమె కాలారీ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కంపెనీల్లో బోర్డు మెంబర్‌గా ఉన్నారు. వాణీ కోలా విజయవంతమైన వెంచర్ క్యాపిటల్స్ లేదా స్టార్టప్స్‌లలో డ్రీమ్ 11, అర్బన్ ల్యాడర్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, అప్ స్టాక్స్ ఉన్నాయి.

ఝాన్సీ రెడ్డి  తెలుగు వ్యాపారవేత్త. రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అయిన ఝాన్సీ రాజ్ ప్రాపర్టీస్ సీఈవోగా ఉన్నారు. వుమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్‌ను (WETA)ను స్థాపించారు.