తెలుగు: బండి ఱ గురించి మీకు తెలియని విచిత్రాలు

August 05, 2020

భాష... సంస్కృతి మిళితమై ఉంటాయి. ఏదైనా భాష అంతరిస్తుంది అంటే ఆ సంస్కృతి మెల్లగా కనుమరుగు అవుతుందని అర్థం. అందుకే మన సంస్కృతి బతకడానికి మన భాషను కాపాడుకోవాలి. ఎలాగూ జగన్ ఈ ఐదేళ్లలో తెలుగును ఎలాగైనా కనుమరుగు చేసే గట్టి ప్రయత్నంలో ఉన్నారు. కనీసం మనకు మనం తెలుగు పౌరులుగా తెలుగును గుర్తుచేసుకుంటూ అది అంతరించకుండా కాపాడుకుందాం. 

అసలు తెలుగు గొప్పదనం మరే భాషలో లేదనలేం గానీ... తెలుగు ప్రపంచంలో ఏ భాషకూ తీసిపోదనేది కూడా నిజం. ఉదాహరణ... మనం తెలుగు లోని "ఱ" (బండి ర), అరుసున్న వృథా అనుకుంటాం. కానీ దాంతో ఎన్నిపదాలున్నాయో తెలుసా... మనకే తెలియక వాటిని తప్పుగా రాస్తున్నాం.

వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన భాషా సంపదలో ఇవీ భాగమే. 

అరసున్న, ఱ ల వల్ల
అర్థభేదం ఏర్పడుతొంది.

పదసంపదకి ఇవి తోడ్పడతాయి.

అరుఁగు = వీది అరుగు (కూర్చునేది)

అరుగు = వెళ్ళు, పోవు (అరిగిపోయి తరిగిపోయేది)

అఱుగు =  జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = బాధ, 7 సంఖ్య

 

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువుకాలము

కాఱు = కారుట (స్రవించు)
(కారు=వాహనం ఆంగ్ల పదము)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి= తఱచు

తీరు= పద్ధతి

తీఱు = నశించు

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు = దారము పోఁగు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగాగల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

మన తల్లిదండ్రులు, మన మాతృభాష
ఎంతో విలువైనవి

గుర్తుంచుకుందాం గౌరవించుకుందాం