అమెరికాలో తెలుగు విద్యార్థి క‌న్నుమూత‌

August 04, 2020

అమెరికాలో మ‌రో తెలుగు విద్యార్థి క‌న్నుమూశాడు. నార్త్ క‌రోలినా యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ చేస్తున్న వివేక్ తుది శ్వాస విడిచాడు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన 24 సంవ‌త్స‌రాల వివేక్ ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించాడు. చార్లెట్టో న‌గ‌రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో ప‌నిచేస్తున్న వివేక్ విధులు ముగించుకొని శుక్ర‌వారం ఇంటికి తిరిగి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న సంభ‌విస్తుంది. ఈ స‌మ‌యంలో ట్ర‌క్ ఢీకొట్టింది.

ఏపీలోని చిత్తూర్ జిల్లా ఐరాల మిరియంగంగ‌న‌ప‌ల్లి వాసి వివేక్. ఆయ‌న త‌ల్లిదండ్రులు అయిన ప‌త్తిపాటి ఉమ‌పతి నాయుడు మ‌రియు ఉమాదేవి బెంగ‌ళూరులో నివ‌సిస్తున్నారు. ఆయ‌న తండ్రి ఉమాప‌తి లాయ‌ర్‌. వివేక్ అకాలమ‌ర‌ణం ప‌ట్ల ఆయ‌న త‌ల్లిదండ్రులు షాక్‌కు లోన‌య్యారు. వివేక్ ఉన్న‌త‌విద్యాభ్యాసంలో చురుకుగా వ్య‌వ‌హ‌రించేవాడ‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు.

చిన్నత‌నం నుంచి చురుకైన విద్యార్థిగా పేరున్న వివేక్ ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చిత్తూర్‌లో విద్యాభ్యాసం చేశారు. బెంగ‌ళూరులో ఆరో త‌ర‌గ‌తి నుంచి బీటెక్ వ‌ర‌కు ఆయ‌న చ‌దువు సాగింది. వివేక్ భౌతిక కాయం బుధ‌వారం ఆయ‌న స్వ‌గ్రామం అయిన చిత్తూర్ జిల్లా ఐరాల మిరియంగంగ‌న‌ప‌ల్లికి బుధ‌వారం తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న అంత్య‌క్రియ‌లు అక్క‌డే చేయ‌నున్నారు.