మంత్రుల్లో టెన్ష‌న్‌....

May 29, 2020

ఎన్నిక‌లు ముగిసిన ఏపీ మంత్రుల్లో మాత్రం టెన్ష‌న్ తొలిగేలా క‌నిపించ‌డం లేదు. మంత్రి ప‌ద‌వి ప‌క్క‌డ పెడితే నియోజ‌క‌వ‌ర్గంలో ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయో అనే ఆందోళ‌న మొద‌లైంద‌ట‌. వాస్త‌వానికి ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏర్ప‌డితే అది ముందుగా మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తున్న వారిపైనే చూపిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ మ‌రో సారి గెలిచిన‌ప్ప‌టికి ప్ర‌జా వ్య‌తిరేక‌త కు మంత్రి ప‌ద‌వులో ఉన్న వారు బ‌లికావాల్సిందే. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇది అనేక మార్లు జ‌రిగింది. ఇప్పుడు కూడా ఇలాంటిదేమైన జ‌రుగుతుందా అని మంత్రులు కంటి మీద కునుకు లేకుండా గ‌డుపుతున్నార‌ట‌. ఏపీలో సీఎం చంద్ర‌బాబునాయుడు పై కొంత వ్య‌తిరేక‌త ఉంది. గుంటూరు త‌ప్పితే మిగ‌తా అన్ని ప్రాంతాల్లో టీడీపీ పై వ్య‌తిరేక‌త ఉంది. అయితే అ వ్య‌తిరేక‌త పోలింగ్ కేంద్రం వ‌ర‌కు వెళ్లే వ‌ర‌కు ఉంటుందా లేదా అనేది ఎవ‌రు చెప్ప‌లేరు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన నోర్లే ఉన్న పార్టీల‌క‌న్నా అధికారంలో ఉన్న వారే బెట‌ర్ అనుకుంటే ఓటు చీలిపోయే ప్ర‌మాదం ఉండ‌దు. ఏపీలో ప్ర‌స్తుతం ఓట‌రు నాడి ప‌ట్టుకోవ‌డం ఎవ‌రి వ‌ల్ల సాధ్యం కావ‌డం లేదు. పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం అనే దాని పై ఆస‌క్తి క‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. అధికార పార్టీ మీద వ్య‌తిరేక‌త‌తో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని వైసీపీ ఆరోపిస్తుంది. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులైన వారే ఓటు వేయ‌డానికి వ‌చ్చారంటూ టీడీపీ వాధిస్తుంది.

ఈ వాద‌న‌లో నిజం ఎంత ఉందో తెలియ‌దు కాని వ్య‌తిరేక ఓటు గ‌నుక ప‌డితే త‌మ ఓట‌మి ఖాయ‌మ‌ని మంత్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన తెలంగాణ మ‌రో సారి అధికారంలోకి వ‌చ్చింది. కేసీఆర్ గాలి వీచిన‌ప్ప‌టికి మంత్రి ప‌ద‌వులో ఉండి ఓ వెలుగు వెలిగిన ముగ్గురు ఓట‌మి పాల‌య్యారు. ఇదే విధంగా ఏపీలో ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తే ప‌రిస్థితి ఎంటా మంత్రులు స‌మాలోచ‌న‌లో ప‌డ్డారు. వాస్త‌వానికి ఒక్క‌సారి మంత్రి ప‌ద‌వి కోల్పోతే తిరిగి పూర్వ వైభ‌వం రావ‌డం చాలా క‌ష్టం. ఏపీలో అసెంబ్లీ సెగ్మెంట్‌ల నుంచి పోటీ చేసిన ప‌ది మంత్రులు ఓట‌మి పాల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అది ఎవ‌రా అనే దాని పై మంత్రులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఆ జాబితాలో త‌మ పేరు ఉంటే భ‌విష్య‌త్తులో ఎలా న‌డుచుకోవాల‌నే దానిపై ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నారు. మంత్రులు ఓడిపోయిన‌ప్ప‌టికి ఏపీలో తిరిగి టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే పెద్ద స‌మ‌స్యేమి ఉండ‌దు. ఎందుకంటే బాబు అత్యంత సన్న‌హితులు గ‌న‌క ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి అయినా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌చ్చు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితి ఇది అమ‌లు జ‌రిగే ప‌రిస్థితులు లేవు. ఎందుకంటే పార్టీలోకి వ‌ల‌స వ‌చ్చిన బ‌ల‌మైన నాయ‌కులు అనేక మంది ఉన్నారు. వారు గెలిస్తే మంత్రి ప‌ద‌వి ఖ‌చ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఓట‌మి పాలైన వారి ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారే ప్ర‌మాదం ఉంది. ఒక వేళ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అంద‌రితో క‌లిసి ఓడిపోయామ‌నే బాధ త‌ప్పితే రాజ‌కీయ భ‌విష్య‌త్తు డోకా ఉండ‌దు. మంత్రుల భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో ...