ఏపీలో రాక్షస హింస - టెర్రరిస్టు పాలన : చంద్రబాబు

May 30, 2020

సాధారణంగా చాలా సాఫ్ట్ భాషలో మాట్లాడే చంద్రబాబు కోడెల ఆత్మహత్యతో ఈరోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ పరుష పదజాలం వాడారు. ఏపీలో టెర్రరిస్టు పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అరాచక పాలనలో ప్రజలు భయంభయంగా బతికే పరిస్థితి దాపురించిందన్నారు. పురాణాల్లో రాక్షసులు పెట్టిన హింసల కథలు సరదాగా విని ఆనందించేవారమని... ఇపుడు జగన్ పాలనలో ప్రత్యక్షంగా అనుభవిస్తూ బాధపడుతన్నామన్నారు.

కోడెలది మరణం కాదు, ఆత్మహత్య కాదు... ప్రభుత్వ హత్య. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం. లక్ష కోట్లు చుకున్న వ్యక్తి... మాజీ స్పీకర్‌ కోడెలపై ఫర్నీచర్‌ దొంగతనం మోపితే  ఆ మానసిక క్షోభతో కోడెల తీవ్ర కలత చెందారు. అది చాలక కోడెలను సొంత కొడుకే చంపేశాడంటూ సొంత విషపుత్రికలో వార్తలు రాసి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారు. జనానికి చెప్పండి. కోడెల మృతి ప్రభుత్వ హత్య అని ప్రచారం చేయండి,  రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా కోడెలకు సంతాపాలు ప్రకటిస్తూ జగన్ అరాచక పాలన గురించి జనాలకు వివరించమని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తికే ఆత్మహత్య చేసుకోవాలనిపించేలా జగన్ వ్యవహరిస్తున్నారంటే... ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ కుట్రలపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. 

వైసీపీ ప్రభుత్వానికి పద్ధతి లేదు, అవగాహన లేదు. అన్నిటికి మించి సిగ్గులేదు.  రాష్టానికి ఆయువు పట్టు అయినటువంటి అమరావతి, పోలవరం, పీపీఏల రద్దును అందరూ వ్యతిరేకించారు. కేంద్రం కూడా తప్పు పట్టింది. అయినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సిగ్గులేకుండా సమర్థించుకుంటు పాలన సాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక చేతికాని అసమర్థుడి పాలనలో ప్రజలు మాడి మసైపోతున్నారని చంద్రబా వ్యాఖ్యానించారు.  

Read Also

కోడెల గొడవలో సైడైంది గానీ బీజేపీ జగన్ ను ఏకేసిందీరోజు
ఫొటోలు - ఎన్టీఆర్ భవన్లో కోడెలకు బాబు, లోకేష్ నివాళి
కోడెల భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు