అందరికీ ట్విస్ట్ ఇచ్చిన రాయలసీమ లీడర్

February 26, 2020

రాష్ట్రంలో జగన్ పై వస్తున్న రకరకాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన జగన్... ఒక్క దెబ్బతో అవన్నీ ఆపేశాడు. ఆ దెబ్బ రాజధాని దెబ్బ. రాజధాని మార్పు ప్రకటన తర్వాత అంత సేపు తిట్లు తిన్న జగన్... మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి... జనం జనం కొట్టుకునేలా చేసి తాను ప్రశాంతంగ నిద్ర పోతున్నారు. జగన్ విసిరన ట్రాప్ లో అన్ని పార్టీలు ఇరుక్కున్నాయి. బాబు, పవన్ లకు తెలియడం లేదు గాని... వాళ్లు కూడా ట్రాప్ లో పడ్డారు. మరి దీన్నుంచి ఎలా తప్పించుకుంటారన్నది వేచిచూడాలి. ఇక పోతే.. రాజధాని విషయంలో... చంద్రబాబు, జగన్ లను ఇద్దరినీ తిడుతూ కొత్త పాయింట్ తీశాడు టీజీ. పనిలో పనిగా బాబు, జగన్ లను సీమ ద్రోహులుగా ముద్ర వేశాడు.

’’రాయలసీమ వారికి పొరుగింటి పుల్లకూర రుచి. బాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ వారే. ఒకరు హైదరాబాదులో ఉన్న రాజధాన్ని బంగారు పళ్లెంలో తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. ఇంకొకరు అదే బంగార పళ్లెంలో తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టారు. ఇద్దరు సీమ ద్రోహులు. వీరికి తమ ప్రాంతం ఏమైపోయినా ఇతర ప్రాంతాలను బాగా చూసుకుంటున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే కలిసి ఉంటాయి. లేకపోతే గొడవలు వస్తాయి. భవిష్యత్తులో మమ్మల్ని గెంటేయరని గ్యారంటీ ఏంటి?’’ అంటూ టీజీ ఇద్దరిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీజీ వెంకటేష్ రాయలసీమ వాసుల్లో కొత్త ఆలోచన వచ్చేలా చేశారు. ఒకరకంగా చెప్పాలంటే... జగన్ కోరుకున్నది కూడా ఇదే. అయితే... జగన్ కి ఎలాగూ కడప, కర్నూలులో పూర్తి మద్దతు, చిత్తూరులో యావరేజ్ మద్దతు ఉంది కాబట్టి... తానేం చేసినా తనతో ఉంటారన్న ఇగోతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంటే పరోక్షంగా అమరావతి గురించి రాయలసీమ వాసులు ఆలోచించకుండా మద్దతు పలకకుండా తమ గురించి మాట్లాడుకునేలా చేసి తద్వారా అమరావతిని కిల్ చేయాలనేది జగన్ ప్లాన్. చూస్తుంటే... వరుసగా అందరూ జగన్ ట్రాప్ లో పడుతున్నట్టు ఉంది.