మీ జిల్లా రెడ్ జోన్లో ఉందా? గ్రీన్ జోన్ లో ఉందా?

August 15, 2020

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ విశ్వప్రయత్నం చేస్తున్నా ఇంకా అది అదుపులోకి రావడం లేదు. రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను పట్టి తాజాగా రెడ్ జోన్లను, ఆరెంజ్  జోన్లను, గ్రీన్ జోన్లను కేంద్రం గుర్తించింది.  మార్చి నుంచి కేసులు నమోదైన తీరు ఆధారంగా వీటిని నిర్ణయించింది.  మరి తెలంగాణ, ఆంధ్రల్లో ఏ జిల్లాలు ఏ జోన్లోకి వస్తాయో పరిశీలిద్దామా?

తెలంగాణలో రెడ్ జోన్ జిల్లాలు

హైదరాబాద్‌, సూర్యపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు రెడ్ జోన్‌లో పెట్టింది కేంద్రం.

తెలంగాణలో ఆరెంజ్ జోన్ లో ఉన్న జిల్లాలు

నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలు ఆరెంజ్ జోన్ . 

గ్రీన్ జోన్ లో ఉన్న తెలంగాణ జిల్లాలు

పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి జిల్లాలు గ్రీన్ జోన్ అంటే... మే3 తర్వాత ఇక్కడ చాలా వరకు సడలింపులు ఉంటాయి.

============

ఏపీలో రెడ్ జోన్ జిల్లాలు

ఈ జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు  జిల్లాలున్నాయి

ఏపీలో ఆరెంజ్ జోన్ జిల్లాలు 

ఈ జాబితాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖలు ఉన్నాయి.  

ఏపీలో గ్రీన్ జోన్ జిల్లాలు

విజయనగరం జిల్లా మాత్రమే ఏపీలో గ్రీన్ జోన్ గా ఉంది.

మరి మీ జిల్లా ఏ జోన్లో ఉందో గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా వ్యవహరించండి. మే 3 తర్వాత జోన్లను బట్టి నిబంధనలుంటాయి. బహుశా రెడ్ జోన్ జిల్లాలకు లాక్ డౌన్ కంటిన్యూ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల ఇంకొన్నాళ్లు మనకు ఇబ్బందులు తప్పేలా లేవు. మానసికంగా మీరు సిద్ధమైపోండి.