ఈఎంఐ మతలబు.. తెలుసుకోకుంటే బుక్ అవుతారు

August 12, 2020

చదివేటపుడు సరిగా చదవాలి

వినేటపుడు సరిగా వినాలి

చాలాసార్లు ఈ రెండు పాటించకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతుంటాయి. తాజాగా ఆర్బీఐ ప్రకటన ఒకటైతే... బయట జనం ప్రచారం చేస్తున్నది ఇంకోటి. ఆర్బీఐ చాలా స్పస్టంగా... ఈఎంఐలపై మూడు నెలలపాటు మారటోరియం విధిస్తున్నట్టు చెప్పింది. అంటే వచ్చే మూడు నెలలు... ఏప్రిల్, మే, జూన్ ఈఎంఐలు జనం కట్టకపోయినా సిబిల్ స్కోరు మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. మిమ్మల్ని బ్యాంకు డిఫాలర్టరుగా భావించదు. ఒకవేళ మీరు కనుక లోను కట్టాలనుకుంటే కట్టొచ్చు. కట్టకపోయినా పర్లేదు. ఆర్బీఐ చాలా స్పష్టంగా అన్ని రకాల టర్మ్ లోన్లు అని పేర్కొంది. అంటే హోంలోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి నిర్ణీత కాలానికి తీసుకున్న రుణాలు.

బయట జనం మాత్రం క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రచారం చేస్తున్నారు. క్రెడిట్ కార్డు అనేది టర్మ్ లోన్ కిందకు రాదు. కాబట్టి క్రెడిట్ కార్డు బిల్లులు తప్పకుండా చెల్లించాల్సిందే. అయితే... ప్రస్తుతం నేపథ్యంలో ఆయా బ్యాంకులు దీనిపై నిర్ణయం తీసుకుంటే చెప్పలేం గాని ఆర్బీఐ మాత్రం వీటిపై ఏ ప్రకటన చేయలేదు. అన్నిరకాలుగా వ్యాపారాలు దెబ్బతినడంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరికీ సరిగా ఆదాయం లేదు. గవర్నమెంటు ఉద్యోగులు తప్ప ఇతరులకు కచ్చితంగా ఫుల్ శాలరీలు వస్తాయని నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ వెసులుబాటు కల్పించింది. క్రెడిట్ కార్డు అనేది ఒక స్వేచ్ఛ. అది స్వచ్ఛంద విలాస ఎంపిక కిందకు వస్తుంది. కాబట్టి దానికి ఈ మినహాయింపు వర్తించదు. క్రెడిట్ కార్డ్ టర్మ్ లోన్  కు కూడా మారటోరియం వర్తించదు. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా కట్టాల్సిందే.  

కొసమెరుపు - ఈ మూడు నెలల ఈఎంఐ తదనంతర కాలంలో చెల్లించాలి. రద్దు అయినట్టు కాదు.