డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ సొల్యూష‌న్స్‌లో మరో విప్లవం

August 06, 2020

ఫ్రంట్‌యాడ్ మీడియా ఐఎన్‌సీ, సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఎదిగిన డిజిట‌ల్ ఎంట‌ర్‌ప్రైజ్, అమెరికాలోని ద‌క్షిణాసియా వాసులకు మ‌రింత చేరువ అయ్యే క్రమంలో డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ బ్రాండ్ సొల్యూష‌న్స్‌ను ప్రారంభించింది. అమెరికాలో ద‌క్షిణాసియా ప్ర‌జ‌ల యొక్క జ‌నాభా పెద్ద ఎత్తున పెరుగుతోంది. అయితే, వారికి త‌గిన రీతిలో స‌రైన అడ్వ‌ర్టైజింగ్‌ అవ‌కాశాల‌ను గుర్తించేందుకు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి, వారికి చేరువ అవ‌డంలో అనేక ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి బ్రాండ్‌ యొక్క అవ‌స‌రాన్ని తీర్చేలా క‌స్ట‌మైజ్డ్ బ్రాండ్ సొల్యూష‌న్స్‌ను ఫ్రంట్‌యాడ్ మీడియా ఐఎన్‌సీ ఈ డిజిట‌ల్ సొల్యూష‌న్స్‌ను అత్యంత ప్ర‌ణాళిక బ‌ద్దంగా అందుబాటులోకి తెచ్చింది.
ఫ్రంట్‌యాడ్ మీడియాకు అన్ని ర‌కాలైన ప్ర‌చార విధానాల‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాన‌ర్లు, రిచ్ మీడియా, ఇప్ప‌టికే సుప‌రిచితం అయిన CompareRemit.com, Path2USA.com మ‌రియు Trackitt.com ప్ర‌భావ‌వంతం చేసే కంటెంట్‌ను అందిస్తున్న వాటితోనూ అనుసంధానం అయింది. ఫ్రంట్‌యాడ్ మీడియా సీఈఓ మ‌రియు ఫౌండ‌ర్ రాజీవ్ శ్రీ‌వాస్త‌వ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ``ఫ్రంట్‌యాడ్ మీడియా సేవ‌ల‌ను ప్రారంభిస్తున్న సంద‌ర్భంగా మేమెంతో సంతోషిస్తున్నాం. దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌కు పైగా మేం ద‌క్షిణాసియా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్నాం. అయితే, వివిధ బ్రాండ్ల‌కు ఈ ప్ర‌జానికాన్ని చేరుకోవ‌డంలో స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆయా బ్రాండ్ల‌కు వారి ల‌క్ష్యాలు చేరుకునేందుకు స‌హ‌క‌రించ‌డం, బ్రాండ్ల యొక్క ఖాళీని పూరించ‌డం ల‌క్ష్యంగా కృషి చేస్తున్నాం`` అని తెలిపారు.
ప్ర‌ముఖ ఔత్సాహిక వ్యాపార‌వేత్త అయిన రాజీవ్ శ్రీ‌వాస్త‌వ ఇప్ప‌టికే అనేక సుప‌రిచిత‌మైన క‌న్జ్యూమ‌ర్ డిజిట‌ల్ బ్రాండ్ల‌ను ప్రారంభించారు. VisitorsCoverage Inc. వంటివి ఇందులో ఉన్నాయి. ``అమెరికాలో ఉన్న ముగ్గురు ద‌క్షిణాసియా వాసుల్లో ఒక‌రు మా సేవ‌ల్లో ఏదో ఒక‌దానిని పొందుతున్నారు`` అని వెల్ల‌డించారు. సంప్ర‌దాయ మీడియాకు మ‌ధ్య‌వ‌ర్తులుగా ప‌నిచేసే విధానాన్ని ఫ్రంట్‌యాడ్ మీడియా పూర్తిగా మార్చివేసింది. సృజనాత్మ‌క‌మైన డిజిట‌ల్ ఛానెల్ల ద్వారా పూర్తి స‌మ‌గ్ర‌మైన‌ సేవ‌లు అందిస్తున్న ఘ‌న‌త‌ను సైతం ఫ్రంట్‌యాడ్ మీడియా సొంతం చేసుకుంది.