నిమ్మగడ్డ ఆయుధం రాజ్యాంగమే !

August 10, 2020

ప్రపంచంలోనే భారత రాజ్యాంగం దృఢమైన రాజ్యాంగం అని చదువుకున్నాం. 9వ తరగతిలో దీని గురించి ఉంటుంది. ఈ తరానికి ఈ రాజ్యాంగం అవీ పెద్దగా పట్టవు. కానీ జనాలు, ఓట్లు, పదవులు... ఇవన్నీ సృష్టించిందే రాజ్యాంగం. ప్రధాని సహా అందరూ దానికి లోబడి ఉండాల్సిందే. అలా జరగని రోజు ఈ దేశం అంతం అయిపోతుంది. అంత పకడ్బంధీగా రాశారు మన రాజ్యాంగాన్ని.

అందుకే ఎవరు ఎన్ని వేషాలేషినా... రాజ్యాంగంతో ఇంతవరకు ఏ ప్రధాని ఆడుకోలేదు. ఒక్కసారి దానితో ఆడుకున్న పాపానికి ఇందిరాగాంధీని సచ్చాక కూడా వదల్లేదు. విచిత్రం ఏంటంటో... అత్యంత శక్తివంతమైన ప్రధానిగా ఇందిరాగాంధీ దేశాన్ని ముందుకు నడిపించే ఎన్నో సమున్నత నిర్ణయాలు తీసుకున్నా... రాజ్యాంగం విషయంలో ఆమె చేసిన ఒకే ఒక తప్పు ఆమె చేసిన ఒప్పులు, గొప్పలు అన్నిటినీ కనుమరుగు చేసింది. 

ఆమె విధించి ఎమర్జెన్సీని చర్చించుకుంటున్నాం గాని ఆమె చేసిన గొప్ప పనులు చర్చించుకోవడం లేదు. అందుకే పదికాలాల పాటు ప్రజల మన్ననలు పొందాలంటే రాజ్యాంగ పరిమితులకు లోబడి పరిపాలించాలి. అలా చేయడం పాలకులకు, ప్రజలకు ఇద్దరికీ మంచిది.

ఇక పోతే నిమ్మగడ్డ మొత్తం వ్యవహారాన్ని సింపుల్ గా చెప్పేశాడు ఓ నెటిజన్..

కింద చదవండి.

చంద్రబాబు తొత్తు అన్నారు

కమ్మ కులం అన్నారు

పార్క్ హయత్ హోటల్ అన్నారు

టిడిపి బిజెపితో సంబంధాలు అన్నారు

వస్తే బొచ్చు పీకుతాడా అన్నారు

ఎలా వస్తాడో మేము చూస్తాం అన్నారు

తొలగించే అధికారం మాది అన్నారు

కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అన్నారు 

చివరికి నిమ్మగడ్డను మీరే కమిషనర్ చేశారు 

రాజ్యాంగమే ఆయుధంగా మారినపుడు గెలుపు అటువైపే ఉంటుంది. ఈ విషయం ఈరోజు ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.