తిరుమలలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడండి

August 05, 2020

తిరుమల శ్రీవారి ఆలయంలో దాదాపు మూడు నెలల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం లభిస్తోంది. ఈరోజు ఉద్యోగులకు దర్శనాలు అనుమతిస్తున్నారు. ఎక్కడికక్కడ శానిటైజర్లు ఏర్పాటుచేశారు. శానిటైజేషన్ పరికరాలు సమకూర్చారు. ప్రతి రోజు శానిటైజేషన్ జరుగుతోంది. కేంద్రం ఇచ్చిన నిబంధనలు అన్ని అమలు చేస్తున్నారు. మాస్కులు తప్పనిసరి. మార్కింగ్ లైన్స్ ప్రకారం నిలబెడుతున్నారు. 

అయితే భక్తులకు నమస్తేఆంధ్ర చెప్పేసూచనలు

  1. ఎంత శానిటైజేషన్ చేసినా ముప్పు తప్పదు. చేతులు ఎక్కడా ఆనించవద్దు. దేనిని ముట్టుకోవద్దు.
  2. మీ వెంట సొంతంగా శానిటైజర్ తీసుకెళ్లండి. మొహాన్ని ముట్టుకోవాల్సి వచ్చినపుడు దానితో శుభ్రపరుచుకుని ముట్టుకోండి.
  3. శ్రీవారి దర్శన భాగ్యం ఒక అదృష్టం. శ్రద్ధగా స్వామి వారిని నమ్ముకోండి. ఏకాగ్రతతో స్వామి నామస్మరణలో చేతులు దండం పెట్టుకుంటూ పోవడం ద్వారా ఎక్కడా ముట్టుకోకుండా ఉండొచ్చు. 
  4. తలనీలాలు సమర్పించే ఆలోచన ఉంటే... ఒక హాట్ వాటర్ కెటిల్ తీసుకెళ్లండి. బ్లేడు, డెటాల్ కూడా వెంటపెట్టుకోండి. మీరు తీసుక్కెళ్లినవి వాడమని చెప్పండి. వేడిచేసుకోవడానికి అక్కడ ఎక్కడైనా పవర్ సప్లై ఉంటుది. 
  5. మాస్కులు నాలుగైదు పట్టుకెళ్లండి.
  6. న్యూస్ పేపర్లు బ్యాగులో తీసుకెళ్లండి. ఎక్కడైనా కూర్చోవడానికి, ఎక్కడైనా చేతులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ పేపరు పరిచి పెట్టండి. పేపరు ఒకసారే వాడండి.
  7. టవల్స్, బెడ్ షీట్లు తీసుకెళ్లండి. వాడినవస్తువుల కోసం ప్రత్యేకంగా బ్యాగు తీసుకెళ్లండి. వాడినవి అందులో వేయండి.
  8. ఆధార్ కార్డు జిరాక్సులు ఇక్కడి నుంచే తీసుకెళ్లండి. పెన్ను మీ వద్ద పెట్టుకోండి. ఎవరి వస్తువులు వాడొద్దు.