వైసీపీ ఉలిక్కిపడింది 

August 13, 2020

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీలో ఎన్నో వివాదాలు తెరమీదకు వస్తున్నాయి.

ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారం, లడ్డూ ధర పెంపు, గదుల ధర పెంపు...  స్వామి వారి డబ్బును గతంలో కంటే ఎక్కువ ప్రభుత్వానికి వాడుకోవడం ఇలాంటివి ఎన్నో తెరమీదకు వచ్చాయి.

అయితే, టీటీడీ కొన్నిటిని తమకు సంబంధం లేదంటూ కొట్టేసింది.

తాజగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది.

గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి టీటీడీ మాసపత్రిక సప్తగిరితో పాటు క్రైస్తవ మత ప్రచారం పుస్తకం వచ్చినట్లు ఇంటర్నెట్లో ఫొటోలు వైరల్ అయ్యాయి.

పాఠకుడు అడ్రస్ తో సహా పెట్టారు. పార్సిల్లో వచ్చినవననీ ఫొటో తీసిపెట్టాడు. ఇది బాగా వైరల్ అయ్యింది.

దీంతో ప్రతిపక్షాలు సర్కారు తీరుపై దుమ్మెత్తి పోశాయి. మత ప్రచారం తప్పులేదు గాని ఇలా హిందు మత ఆలయాలను ఆధారంగా చేసుకుని ప్రచారం చేయడాన్ని తప్పు పడుతున్నాయి.

మరోవైపు  టీటీడీ దీనిని తీవ్రంగా తప్పుపట్టింది.

అది టీటీడీ ద్వారా జరగలేదు. కుట్ర జరిగింది అని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 ఇది దురుద్దేశపూరిత చర్య అంటూ తీవ్రంగా ఖండించింది. 

ఈ విషయంలో ఇది ఎలా జరిగింది అన్న దానిపై పోలీసులు  ఫిర్యాదు చేయగా  విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా పత్రిక ఎలా సరఫరా అవుతుందన్నది టీటీడీ వివరించారు. 
సప్తగిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, డెలివ‌రీ బాధ్య‌త మొత్తం పోస్ట‌ల్ శాఖ‌దే అని,  దీనికోసం పోస్ట‌ల్ శాఖ‌కు పోస్టేజి చార్జీల‌తో పాటు ప్యాకేజింగ్ కింద ఒక్కో ప్ర‌తికి అద‌నంగా రూ. 1.05 టీటీడీ చెల్లిస్తోందని వెల్లడించింది.
మొత్తానికి దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి, టీటీడీకి ఇద్దరికీ ఉంది.
ఇదిలా ఉండగా... ఈ వ్యవహారంతో వైసీపీ ఉలిక్కిపడింది.
ఇప్పటికే బీజేపీ జగన్ పై క్రైస్తవ ముద్ర వేసిన నేపథ్యంలో ఇది సంచలనం అయ్యింది.