వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ లడ్డూ వ్యాపారం !!

May 31, 2020

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియన్ అని నమోదు చేసుకున్నారు. అయినా పరమత సహనంతో అందరినీ సమంగా చూస్తారు అని అందరూ ఆశించారు. కానీ పరిస్థితులు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వచ్చిన కొత్తలోనే చర్చిల నిర్మాణానికి నిధులు విడదల చేస్తూ జీవోలు వచ్చాయి.

అనంతరం లౌకిక రాజ్యం అయిన భారతదేశంలో... ఒక మతానికి చెందిన పాస్టర్లకు 5 వేల రూపాయలు నెలనెలా ఇవ్వాలని జీవో ఇచ్చారు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వానికి మతం ఉండకూడదు. కానీ మతం ఆధారంగా జీతాలు, రిజర్వేషన్లు నిధులు ఇవ్వడంతో ఇక రాబోయే రోజుల్లో ఏపీ ఎలా ఉండబోతుందో అందరూ అప్పట్లో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. పరిస్థితి అలాగే కనిపిస్తోంది.

హిందూ ప్రముఖ ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి వెలసిన తిరుమలలో లడ్డూపై  సబ్సిడీ ఎత్తివేశారు. గదుల ధరలు పెంచారు. తిరుమల బస్సు టిక్కెట్లపై మత ప్రచారం నిర్వహించారు. ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. తాజాగా మరో విచిత్రం తిరుమలలో చోటు చేసుకుంది. 

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో 50% తగ్గింపుతో భక్తుల మధ్య 'తిరుపతి లడ్డూ ప్రసాదం' అమ్మాలని శ్రీ వెంకటేశ్వర ఆలయ అధికారులు నిర్ణయించారు. 175 గ్రాముల బరువున్న పవిత్ర లడ్డూ, సాధారణ రోజులలో అసలు ధర రూ .50, భక్తులకు రూ .25 కు అమ్ముతారు. ఇంతవరకు బాగానే ఉంది. మంచి నిర్ణయమే. స్వామి వారి ప్రసాదం అందుబాటులో ఉంచడంలో ఏ తప్పు లేదు. 

కానీ పెద్ద మొత్తంలో అవసరమైన వారు టిటిడి కేంద్రాల్లో డెలివరీ చేయబోయే అదనపు అవసరాల కోసం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓను 9849575952, పోటు పీష్కర్ 9701092777 నెంబర్లలో సంప్రదించాలన ప్రకటన చేశారు. అది స్వామి వారి ప్రసాదం. దానిని ఇలా బల్కులో అమ్మడంపై విమర్శుు వస్తున్నాయి.

భక్తులకు స్వామి వారి ప్రసాదం అందుబాటులో ఉంచడం ఓకే గాని... ప్రసాదాన్ని ఇలా పెద్దమొత్తంలో అమ్మితే వాటిని మళ్లీ అధిక ధరల అమ్మి స్వామి వారి ప్రసాదంతో వ్యాపారం చేస్తారని... బల్క్ అమ్మడం తప్పు అని స్వామి వారి భక్తులు టీటీడీని వారిస్తున్నారు. స్వామి వారి ప్రసాదం వ్యాపారం అయ్యే పరిస్థితులు కల్పించవద్దని కోరుతున్నారు. వీటిని బల్క్ లో అమ్మే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకుంటే మంచిది అని సూచిస్తున్నారు భక్తులు.

Read Also

సుధాకర్ కేసు: హైకోర్టులో ఏం జరిగిందంటే
హైకోర్టు సంచలనం... సుధాకర్ కేసు సీబీఐకి
అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం