తిరుపతిలో లాక్ డౌన్... తిరుమలలో దర్శనాలా?

August 02, 2020

కరోనా ఉధృతి పెరగడంతో ప్రముఖ్య ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో లాక్ డౌన్ విధించారు. రెండు వారాల పాటు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. తిరుపతి, తిరుమల నగరాల్లో విపరీతంగా కరోనా వ్యాపిస్తోంది. తిరుమలలో ఏకంగా పెద్ద జీయ్యంగారికే కరోనా సోకింది. 15 మంది అర్చకులతో పాటు సుమారు 200 మందికి తిరుమలలో కరోనా సోకింది. 

తిరుమల దర్శనాలకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వారు అక్కడ వసతిలో ఉండాలి. కొందరు తలనీలాలు సమర్పించాల్సి ఉంటుంది. టోకెన్లు తీసుకోవాలి. ఆహారం తీసుకోవాలి. ఇన్ని సార్లు పలువురిని కలవాలి. లక్షణాలు లేకుండా కోవిడ్ ఉన్నవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో తిరుమలలో భక్తులకు దర్శనాలు కొనసాగిస్తే మరింత మంది కోవిడ్ బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది నిరూపితమైంది. పైగా తిరుపతిలో లాక్ డౌన్ ఉండగా దర్శనాలు కొనసాగిస్తే ప్రయాణికుల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు వస్తాయి.

మరి ప్రభుత్వం అందరూ దర్శనాలు ఆపమని చెబుతున్నా ఎందుకు హిందు మత ధర్మాన్ని, సకల జనుల సౌఖ్యాన్ని ముఖ్యమంత్రి జగన అర్థం చేసుకోవడం లేదు. నిజమైన భక్తులు, నిజమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధకులు ఇలా భక్తులను ఇబ్బంది పెడతారా? ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజల్లో ధర్మాగ్రహం మొదలవుతుంది. పాలకులు అంటే ఇబ్బందుల నుంచిప్రజలను రక్షించాలి. కానీ ఇబ్బందులు సృష్టించకూడదు. ఏ దురుద్దేశాలతో దర్శనాలు కొనసాగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

అర్చకుల్లో ఎక్కువ మంది పెద్ద వయస్కులు. వారికి సోకితే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో స్వామి వారి కైంకర్యాలు ఆగకుండా చూడాల్సిన ధర్మాన్ని వైఎస్ జగన్మోహన్ గుర్తుంచుకోవాలి. అలా జరగాలంటే దర్శనాలు ఆపడమే మార్గం అని పలువురు సూచిస్తున్నారు.