VIRAL: పార్లమెంటును షేక్ చేసి లేడీ ఎంపీ ప్రసంగం

November 17, 2019

మహువా మోయిత్ర. ఇపుడు ఈ పేరు దేశంలో చాలా పాపులర్. ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. తొలిసారి ఎంపీగా (తృణమూల్ కాంగ్రెస్) ఎన్నికైన ఆమె భారతదేశ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ చేసిన ప్రసంగం దేశాన్ని విశేషంగా ఆకట్టుకుంది. మహువా మోయిత్ర ప్రసంగం 'స్పీచ్ ఆఫ్ ద ఇయర్‌' అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బెంగాల్లోని కృష్ణానగర్ స్థానం నుంచి ఎన్నికైన మహువా లండన్‌లో బహుళజాతి సంస్థ 'జేపీ మోర్గాన్‌'లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు వచ్చి 2009లో రాజకీయాల్లో చేరారు. తొలుత కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీకి ఆమె ప్రియమైన నాయకురాలు. కానీ పార్టీ వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ఆమె టీఎంసీలో చేరారు. అక్కడ తొలుత ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మొన్న ఎంపీగా ఎన్నియ్యారు.

ఆమె తన తొలి ప్రసంగంలో భారత దేశంలో ఫాసిజం తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని విపులంగా వివరించారు. "ఒకప్పుడు జర్మనీలో ఉన్నది మాత్రమే ఫాసిజం కాదు. ఫాసిజం ఇప్పుడు కూడా చాలా చోట్ల ఉంది. దేశంలో ఫాసిజంతో లక్షల మందిని చంపేస్తారని నేను అనుకోవడం లేదు. కానీ ఫాసిజం తొలి సంకేతాలయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని మహువా వ్యాఖ్యానించారు. లోక్‌సభలో మాట్లాడుతూ- ఫాసిజం ఏడు సంకేతాల గురించి ఆమె వివరించిన తీరు వైరల్ అయ్యింది. ఫాసిజం తొలి సంకేతాలకు సంబంధించి 2017లో అమెరికా హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం లాబీలో ఉంచిన ఒక పోస్టర్‌ను ఆమె ప్రస్తావించారు. (హోలోకాస్ట్ అంటే... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లక్షల మంది యూదులను, ఇతరులను నాజీలు చంపేసిన ఉదంతానికి పెట్టిన పేరు. తెలుగులో వచ్చిన కంచె సినిమా ఈ నేపథ్యంతోనే తీశారు.)

ఇపుడు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో చర్చంతా ఆమె గురించే నడుస్తోంది. ఆమె పూర్తి స్పీచ్ వీడియో లింకు.

 

 

 

ఆమె ప్రసంగం గురించి  Huff post link: https://www.huffingtonpost.in/entry/mahua-moitra-speech-in-lok-sabha_in_5d12f9ade4b04f059e4bcd39 

ఆమె కెరియర్ గురించి సిటిజన్ లింక్ :  https://www.thecitizen.in/index.php/en/NewsDetail/index/9/17183/Who-is-Mahua-Moitra