పార్లమెంటులో అందగత్తెల హడావుడి

July 05, 2020

కాలం మారుతోంది. మన నేతలూ మారుతున్నారు. ఈసారి మునుపటి కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు పార్లమెంటుకు ఎంపికవడంపై అందరూ సంతోషిస్తున్నారు. అయితే, ఎపుడూ జనాలకు ఏదో ఒక వార్త ఉండాలిగా... తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయిన మిమి చక్రవర్తి, నుస్రత్ లు జనాలకు వార్తగా మారారు. లోక్ సభకు ఏకంగా ఒకే పార్టీ నుంచి, ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు తాజా హీరోయిన్లు ఎన్నికవడం అరుదైన విషయమే. వారిద్దరు పార్లమెంటు ముందు మోడ్రన్ దుస్తుల్లో నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు. ఇది నెటిజన్ల చేతిలో ట్రోల్ అయ్యింది.

భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు... మీరు మంచి సంప్రదాయ దుస్తుల్లో పార్లమెంటుకు హాజరయితే గౌరవంగా ఉంటుంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. వారికి కౌంటర్ ఇస్తున్నట్లు .... పార్లమెంటుగా ఎన్నికయిన మీకు అభినందనలు, ఈ కాలానికి తగ్గట్టు ఉన్నారు. మీరిలాగే ముందుకు సాగిపోండి అంటో శివసేన ప్రముఖ లీడర్ ప్రియాంక చతుర్వేది వారికి అండగా నిలిచారు. ఈ అందమైన పార్లమెంటేరియన్లకు ఇంటర్నెట్ లో తెగ క్రేజ్ వస్తోంది. ఒకరు ఇటీవల వారికి సరదాగా... కంగ్రాట్స్ బట్ అక్కడ శశిథరూర్ ఉన్నారు కేర్ ఫుల్ అంటూ ఓ వైరల్ సెటైర్ సోషల్ మీడియాలో  సర్కులేట్ అవుతోంది. మొత్తానికి ఫైర్ బ్రాండ్ మమత ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ పార్లమెంటుకు కళ తెచ్చింది.