జగన్... ఇంగ్లిష్ అసలు వాడని దేశాల గురించి తెలుసా మీకు?

August 03, 2020

ఒకప్పటి రవి అస్తమించని సామ్రాజ్యంలా వెలిగిన వారు బ్రిటిషర్స్ అయితే... రవి అస్తమించని ప్రాంతంలో విస్తరించిన వారు తెలుగు వారు. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు లేని దేశం ఉండదు. ప్రతిదీ ముందుగా పసిగట్టి... కొత్తదానిపై మోజు పడటంలో మన వారికి మించిన వారు లేరు. సెంటిమెంటల్ ఫూల్స్ మనోళ్లు అని పెద్ద అబద్ధం ఎవరు ఆడారో తెలియదు గానీ... భాష, సంస్కృతి సహా దేన్నయినా వదిలేసి కొత్త భాషలను, కొత్త సంస్కృతిని ఆకళింపు చేసుకోెవడంలో తెలుగు వారిని కొట్టే వారు లేరు. దేశంలో ఇంగ్లిష్ మోజు తెలుగు వారికి ఉన్నంతగా ఎవరికీ లేదు. అదేంటో గాని ఇక్కడ ఇంగ్లిష్ ని ఒక నాలెడ్జిగా చూస్తుంటారు. ప్రపంచం గ్రామాల్లో ఉంది. అందుకే ఇపుడు ప్రతిదీ మాతృభాషలోకి వచ్చేస్తోంది. మీకు ఏ భాష రాకపోయినా గూగుల్ ట్రాన్స్ లేటర్ యాప్ వాడుతూ ప్రపంచంలో ఏ భాష వారితో అయినా మీరు మాట్లాడవచ్చు. ఈ కాలంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు అయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయనే భ్రమల్లోకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్. 

వాస్తవానికి ప్రాథమిక విద్య మాతృభాషలో చదవడం అదృష్టం. ఆ అదృష్టం తెలుగు వారికి లేదు. ఇంగ్లిష్ లేకుంటే జీవితమే లేదనుకుంటున్నారు తెలుగు వారు. అందుకే సుశిక్షితులు ఉన్న స్కూళ్లు వదిలేసి ఏ ప్రత్యేక శిక్షణ లేని వారు పాఠాలు చెప్పే ప్రైవేటు బడుల వైపు ఆకర్షితులై డబ్బులు కట్టి మరీ చేరుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఏ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వచ్చే ఏడాది నుంచి అంతా ఇంగ్లిషే అంటున్నారు. ఈ నేపథ్యంలో మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో ఇంగ్లిష్ వాడకుండా హాయిగా బతుకుతున్న, అది కూడా టాప్ లోఉన్న దేశాలు ఉన్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ప్రపంచంలోనే  అత్యంత శ్రేష్టమైన విద్యావిధానంగా కొనియాడుతున్న ఫిన్ లాండ్ ది ఇంగ్లిష్ మీడియం కాదు.  

ఒకసారి ఇంగ్లిష్ ని దూరం పెట్టిన దేశాల లిస్టు చూద్దాం...

చైనా, రష్యా, జపాన్, జర్మని, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్, టర్కి, ఇజ్రాయిల్, ఇటలీ, ఈజిప్ట్, నార్వే, బ్రెజిల్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, మొరాకో, పోలండ్, పోర్చుగల్, స్పెయిన్, తర్కేమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తైవాన్, స్లోవేనియా, స్లోవేకియా, మంగోలియా, ఆర్జెంటినా, యెమెన్, ఉగాండా, చిలి, కొలంబియా, సౌది, ఇరాన్, ఇరాక్, అజెర్ బైజాన్, అల్జీరియా, సిరియా, గాంబియా, తుర్కెమెనిస్తాన్, అంగోలా, బెల్జియం, భూటాన్, కంబోడియా, థాయిలాండ్, క్యూబా, ఫిన్లాండ్, జార్జియా, కజకిస్తాన్ దేశాల్లో ఇంగ్లిష్ మీడియం అనేది చాలా చాలా తక్కువ. ఎవరూ అడగరు. అడపాదడపా విదేశీయులు మాత్రమే అడుగుతారు. అయినా ఈ దేశాల్లో చాలా దేశాలు ఇంగ్లిష్ రహింతగా ఎంతో వృద్ధిని సాధించాయి.