వైకాపా నాయ‌కుల్ని ఆడుకుంటున్న సోష‌ల్ మీడియా

April 03, 2020

తెలుగుదేశం నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ గ‌తంలో కొన్నిసార్లు మాట త‌డ‌బ‌డిన‌పుడు వైకాపా నాయ‌కులు దాని మీద ఎంత ర‌భ‌స చేశారో.. కామెడీ చేశారో తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ పార్టీ నాయ‌కుల త‌డ‌బాటు చూసి అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు.  ముఖ్య‌మంత్రి అయ్యాక జ‌గ‌న్‌కు ఎన్నిసార్లు నాలుక మ‌డ‌త ప‌డిందో చూస్తూనే ఉన్నాం. నిన్న‌టికి నిన్న దిశపై అత్యాచారం, హ‌త్య‌కేసు గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆమె టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం బైక్ దిగితే ఘోరం జ‌రిగిందంటూ సెల‌విచ్చారు ముఖ్య‌మంత్రి. ఇంత సంచ‌ల‌న కేసు గురించి సీఎంకు క‌నీస అవ‌గాహ‌న లేక‌పోవ‌డం దారుణం. 

టోల్ గేట్ లో స్కూటర్లకు టోల్ వసూలు చేయరు అని కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి.. అంటూ జ‌గ‌న్ మీద సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ ప‌డుతున్నాయి. సీఎం ఇలా ఉంటే.. అంబ‌టి రాంబాబు అనే పెద్ద నాయ‌కుడు.. త‌మ ముఖ్య‌మంత్రి క‌న్న‌బాబు అంటూ ఆ మ‌ధ్య ప్రెస్ మీట్లో పేర్కొన‌డం ఎంత చ‌ర్చ‌నీయాంశ‌మైందో తెలిసిందే. మ‌రోవైపు అవినీతి పాల‌న‌కు జ‌గ‌న్ స‌ర్కారు క‌ట్టుబ‌డి ఉంద‌ని ఒక వైకాపా మ‌హిళా ఎమ్మెల్యే అంటే.. మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతి ఉత్స‌వాల గురించి మాట్లాడుతూ.. ఆయ‌న‌ పుట్టి 70 ఏళ్ల‌యింద‌ని సెల‌విచ్చింది మ‌రో ఎమ్మెల్యే. ఓవైపు వైకాపాలోకి జంప్ అయిన వ‌ల్ల‌భ‌నేని వంశీ ప‌ప్పు అండ్ బ్యాచ్ అంటూ లోకేష్ అండ్ కోను విమ‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. ఇక్క‌డా వైకాపా వాళ్లే రివ‌ర్సులో దొరికిపోవ‌డంపై టీడీపీ ట్విట్ట‌ర్లో వీడియో పెట్టి గ‌ట్టిగానే ట్రోల్ చేస్తోంది.