రాజమౌళి నుంచి మారుతి దాకా.. అందరూ ఫిదా

September 17, 2019

బాహుబలి తర్వాత ప్రభాస్‌ నుంచి సినిమాయే లేదు. చాలా గ్యాప్ తర్వాత అతని సినిమా ఆగస్టు 15న రానున్న నేపథ్యంలో తాజాగా టీజర్ విడుదల చేశారు. కళ్లు బైర్లు కమ్మే యాక్షన్ సీక్వెన్స్, హాలీవుడ్ ను తలపించే భారీతనం వెరసి ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఫిదా చేసేసింది. ట్విట్టర్ లో టాప్ లో ఈ సినిమా టీజర్ పై తెలుగు సినీ ప్రముఖుల అభిప్రాయాలివే.

రాజమౌళి: పెట్టిన బడ్జెట్‌కు యూవీ క్రియేషన్స్‌, బాధ్యత విషయంలో సుజీత్‌ సమానంగా న్యాయం చేస్తున్నారు. ‘సాహో’ టీజర్‌ అద్భుతంగా ఉంది. ప్రభాస్‌ బలం ఏంటంటే.. హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, మరోపక్క డార్లింగ్‌లానూ కనిపిస్తాడు.
అక్కినేని నాగార్జున: ఇంత గొప్ప సినిమాను తీస్తున్నందుకు ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు ‘సాహో’.
రానా దగ్గుబాటి: ‘సాహో’ టీజర్‌ వచ్చేసింది.. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
నితిన్‌: ‘సాహో’ టీజర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. నా డార్లింగ్‌ ఫ్రెండ్‌ ప్రభాస్‌కు ఆల్‌ ది బెస్ట్‌.
మంచు విష్ణు: బాబోయ్‌.. ఆ టీజర్‌ ఏంటి? బ్రిలియంట్‌. చూడబోతే ప్రభాస్‌, దర్శకుడు సుజిత్‌ కలిసి ఏదో అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. టీజర్‌ చాలా నచ్చింది.
అల్లు శిరీష్‌: భారతదేశపు అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. తెలుగు సినిమా నుంచి రాబోతున్న మరో అద్భుతం. హాలీవుడ్‌ను పోలి ఉన్న విజువల్స్‌. గెట్‌ రెడీ ఇండియా.
సురేందర్‌రెడ్డి: టీజర్‌ ఫెంటాస్టిక్‌గా ఉంది. ప్రభాస్‌, సుజీత్‌, శ్రద్ధా కపూర్‌, యూవీ క్రియేషన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌.
సిద్ధార్థ్‌: దిమ్మతిరిగిపోయింది. యువ దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ‘డై హార్డ్‌ ఫ్యాన్స్’ గురించి తెలిసిందేగా.
బెల్లంకొండ శ్రీనివాస్: వాట్‌ ఎ యాక్షన్‌ టీజర్‌.. చాలా బాగుంది. చిత్రబృందానికి బెస్ట్‌ విషెస్‌.
మారుతి: ఇలాంటి స్టఫ్‌ ఇస్తే ఫ్యాన్సే కాదు ప్రతీ సినీ ప్రేమికుడు ‘సాహో’కి డై హార్డ్‌ ఫ్యానే. 

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాహో అమెరికా లోకల్ ట్విట్టరులోనూ ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఇది కొత్త చరిత్ర అని చెప్పాలి.