కొరటాల గారు.. ఆ ఇద్దరు ఎవరు?

August 09, 2020

ఇప్పటికే చిరంజీవితో సినిమా చేస్తున్న సూపర్ కమర్షియల్ దర్శకుడు కొరటాల శివను మెగా కాంపౌండ్ వదలడం లేదు. ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఓకే అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ ప్రకటించారు. 

అంతేకాదు ఈ చిత్రం  కాన్సెప్ట్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ పోస్టరు చాలా చమత్కారంగా ఉంది. నది ఈవల ఇద్దరు... నది ఆవల ఉన్న ఓ కోటను చూస్తున్నారు. కాన్సెప్టులో ఒక పడవను కూడా పెట్టారు. బహుశా ప్రస్తుతానికి ఆ ఇద్దరినీ బన్నీ మరియు కొరటాలతో పోల్చాలి. వాస్తవానికి ఆ ఇద్దరు ఎవరో కొరటాలే శివే చెప్పాలి మరి.

అల్లు అర్జున్ కూడా ఈ పోస్టర్ షేర్ చేస్తూ “ నా తదుపరి చిత్రం #AA21 ను కొరటాల శివ తో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలం దీని కోసం ఎదురు చూస్తున్నాను. సుధాకర్ గారు తన మొదటి వెంచర్ నాతో మొదలుపెడుతున్న సందర్భంగా నా శుభాకాంక్షలు‘‘ అంటూ వ్యాఖ్యానించారు.

"నా ప్రియమైన స్నేహితుడు యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని,  GA2Official సహకారంతో ఈ సినిమా నిర్మిస్తున్నట్టు కొరటాల శివ ప్రకటించారు. 
2021 లో ప్రారంభం అయ్యే ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకరటించారు. 

Read Also

చిలకపచ్చ చీర, జడలో మల్లెపూలు... శృం-గార రాణి
అనసూయ... బ్యూటీ ఇన్ బ్లాక్
ఏడ్చినంత పనిచేసిన తెలుగు హీరోయిన్ !!