చిరు, నాగ్ అడగడం... జగన్ కాదనడం ఉంటుందా?

August 05, 2020

Image

​అమరావతి కోసం

తుపాను కోసం

పోలవరం కోసం

వరదల కోసం

అభివృద్ధి కోసం...

​ఏపీ మొహం చూడని సినీ పెద్దలు ఇపుడు హఠాత్తుగా అమరావతిలో ఊడిపడ్డారు. టాలీవుడ్లో షూటింగులకు అనుమతి ఇవ్వాలని అక్కడెక్కడో అమరావతిలో ఉన్న జగన్ ను కలుస్తారట.  జగన్ ను కలవనున్న వారిలో చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్ రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్‌రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్‌ ప్రసాద్ ఉన్నారు. వీరు‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను వీరు కలిశారు. 

సినిమ ా షూటింగులకు అనుమతి ఇవ్వమని వారు అడగడం తడవు... ఠక్కున జగన్ ఓకే చెప్పేశారు. సినీ పరిశ్రమ ఏపీలో రాణించేందుకు అవసరమైన సహకారం ఇస్తామని వారికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రికి సినిమా ప్రముఖులు కృతజ్జతలు చెప్పారు. ఇక నిబంధనలు, విధానాలపై మంత్రి పేర్నినానితో మాట్లాడతామని వారు చెప్పారు. థియేటర్లో ఫిక్స్ డ్ ఛార్జీల ఎత్తివేయడం గురించి, నంది అవార్డుల అంశం గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. 

ఇక ఇది ఒక మొహమాటపు మీటింగ్ మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే... ఇపుడు పెద్దగా ఏపీలో షూటింగ్స్ జరగడం లేదు. తెలంగాణలో అనుమతి ఉంటే చాలు... ఇక్కడే షూటింగులు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ షూటింగులు తీసేది తెలంగాణలో అయినా సినిమాలు బాగా ఆడేది ఆంధ్రలో. కాబట్టి ముఖ్యమంత్రి ఇగో శాటిస్ఫై చేసే మొహమాటపు మీటింగ్ ఇది. ఎలాగూ ఇది వెల్ ప్లాన్డ్ మీటింగే. ఫలితం కూడా ముందే డిసైడైంది. కేసీఆర్ ను కలిసి మరో తెలుగు రాష్ట్ర సీఎంను కలవకపోతే బాగుండదని ఏర్పాటుచేశారన్నమాట.