ఈయన వల్ల మీరు నవ్వలేదని ఒట్టేసి చెప్పండి?

June 06, 2020

పాత తరాల సంగతి తెలియదు గాని... టీవీ మన ఇంట్లో అడుగుపెట్టాక పుట్టిన తరాలకు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం అయిన మనిషి Gene deitch. ఈయన వల్ల మీరు జీవితంలో ఒక్కసారి కూడా నవ్వలేదు అని ఒట్టేసి చెప్పగలరా? ఇంపాసిబుల్. ఆయన నవ్వులు పూయించని ఇల్లు లేదు. ఆయన సృష్టించిన రెండే రెండే క్యారెక్టర్లు .... మన జీవితాంతం చూస్తూ కూర్చున్నా నవ్వించగలవు. మనకు నవ్వులు పంచిన ఆ హృదయం ఆగిపోయింది. కానీ ఆయన పంచి నవ్వులు ఎన్నటికీ ఆగవు. కలియుగాంతం వరకు ఆయువు తీరని క్యారెక్టర్లను సృష్టించి వెళ్లారాయన !

ఆ అద్భుత మనిషికి ఒక RIP సరిపోతుందా?

ఒక నిమిషం మౌనం సరిపోతుందా?

మీరు ఆ పనిచేయలేరు. ఎందుకంటే ఆయన మీ హృదయాల్లో బతికే ఉన్నారు.

ఒక్క నిమిషం పై ఆర్ట్ ను తదేకంగా చూసి మీ అభిప్రాయం చెప్పండి.