అమెరికాలో తుపాను .. 3 లక్షల ఇళ్లకు కరెంట్ లేదు

August 03, 2020
CTYPE html>
క్షణం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేని దేశాల్లో అమెరికా ఒకటి. అలాంటి దేశంలో ఏకంగా మూడు లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా అంతరాయం చోటు చేసుకుందంటే.. మామూలు విషయం కాదు. పెద్ద విపత్తే విరుచుకుపడి ఉంటుంది. నిజమే.. తాజాగా అమెరికా భారీ తుపానుతో వణికిపోతోంది. దీని కారణంగా ఐదుగురు మరణించారు కూడా.
ఉత్తర కరోలినాతో పాటు పెన్సిల్వేనియా.. పశ్చిమ వర్జీనియాలు తుపాను కారణంగా వణుకుతున్నాయి. లక్షలాది మంది తుపానుల కారణంగా తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. వాతావరణ అత్యవసర పరిస్థితిని విధించారు. చాలా చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తుపాను కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వరద ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
తుపాను తీవ్రత కారణంగా పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవటంతోపాటు.. విద్యుత్ సరఫరాకుతీవ్ర అంతరాయం వాటిల్లింది. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తుపాను తీవ్రత ఇలా ఉంటే.. మరోవైపు మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికన్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కోరుతున్నారు. ప్రాణ నష్టంతో పాటు.. ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.