ఇండియాలో ఈ దశాబ్దపు చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే

August 03, 2020

ఈరోజు ఏర్పడిన సూర్య గ్రహణం ఈ దశాబ్దంలో ఇండియాలో కనిపించే చివరి సంపూర్ణ సూర్యగ్రహణం. సాధారణంగా సూర్యగ్రహణం ఏడాదిలో రెండుసార్లు గాని మూడు సార్లు గాని వస్తుంది. భూమి ఉపగ్రహం అయిన చంద్రుడు సూర్యుడికి- భూమికి మధ్య వచ్చినపుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడితో పోలిస్తే చంద్రుడు చాలా చిన్న గ్రహం అందుకే... సూర్యగ్రహణం ఎపుడైనా కూడా కొన్ని భూమిపై కొన్ని ప్రాంతాలకే కనిపిస్తుంది. పైగా రింగులా ఏర్పడి గ్రహణంలోనూ సూర్యుడి చుట్టూ వెలుగుతున్న రింగు ఒకట ికనిపిస్తుంది. 

ఈరోజు దక్షిణ భారతదేశం, శ్రీలంక, సౌదీ అరేబియా, ఒమన్; సుమత్ర (ఇండోనేషియా) ప్రాంతాల్లో ఇది కనిపించింది. 3.39 నిమిషాలు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. గ్రహణం ఇక్కడ ఆచారాల్లో భాగం. అందుకే గ్రహణం అనంతరం హిందువులు -: స్నానం చేస్తారు. అందుబాటులో ఉన్న వారు నదీ స్నానం చేస్తారు. గ్రహణానికి ముందు వండిన పదార్థాలను గ్రహణం అనంతరం చాలామంది ఆహారంగా తీసుకోరు. అందులో గ్రహణ కిరణాలు ప్రసరించి ఉంటాయన్నది నమ్మకం. 

ప్రధాని మోడీ ఈరోజు సూర్యగ్రహణం చూడాలని తపించినా మేఘాలు, పొగ వల్ల చూడలేకపోయారు. చివరకు కోజికోడ్ లో కనిపించిన దృశ్యాలను టీవీ ద్వారా వీక్షించారు.