అల్లు అర్జున్ కు జరిమానా వేయడం కరెక్టేనా? !!

July 05, 2020

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు జరిమానా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తన వాహనానికి బ్లాక్ ఫిల్మ్ వేసి ఉండటం వల్ల ఈ జరిమానా విధించారు. అయితే... ఈ వాహనం ఇప్పటికి అనేకసార్లు మీడియాలో జరిమానా విధించడం మాత్రం మొదటిసారి. ఓ ముస్లిం యువకుడు మహ్మద్ అబ్దుల్ అజాం (ఈ అబ్దుల్ కి పాతబస్తీలో నిబంధనలు ఉల్లంఘించిన వారు కనపడలేద పాపం) ... తనకు హిమయత్ నగర్ లో తారసపడిన ఈ వాహనాన్ని గమనించాడు. దానిని ఫొటో తీసి అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అతికించారు.... అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను పోస్టు చేసిన ఫొటో ఆధారంగా యజమాని అల్లు అర్జున్ కు పోలీసులు జరిమానా విధించారు. ఇపుడు ఇది కరెక్టే కాదా అన్న చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఉంది.
అల్లు అర్జున్ ప్రత్యేక ఈ అత్యాధునిక కారావాన్ ను కొనుగోలు చేశారు. దానికి ఫాల్కన్ గా బన్నీ అప్పట్లో పేరు కూడా పెట్టాడు. తాజాగా ఈ కారావ్యానుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించడంపై అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే... అది వాహనంగా రిజిస్టర్ అయిఉండొచ్చు గాని దానిని వాహనంగా పరిగణిస్తారా అన్న ప్రశ్న వస్తోంది. ఈ వాహనాన్ని షూటింగ్ స్పాట్స్ లో ఒక విశ్రాంతి గదిలా వాడతారు. దీనిని రవాణాకు వాడరు. ఎక్కడైనా షూటింగ్ జరిగితే అక్కడికి అల్లు అర్జున్ తన కారులో వెళ్తారు. డ్రైవరు ఈ వాహనంలో తీర్చిదిద్దిన విశ్రాంతి గదిని తీసుకెళ్తే అక్కడ షూటింగ్ గ్యాప్ లో అల్లు అర్జున్ రెస్ట్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి కారవాన్లకు బ్లాక్ ఫిల్మ్ రూల్ వర్తిస్తుందా? అన్నది ఆలోచించాల్సిన విషయమే.
గుర్తింపు పొందిన నటులు, ప్రముఖులకు ఇవి వాహనాలు కాదు, విశ్రాంతి గదులే. సుప్రీం కోర్టు రూల్ ఏంటంటే... ఆగంతకులు బ్లాక్ ఫిల్మ్ వేసిన కార్లలో కిడ్నాప్ కు పాల్పడటం వల్ల ట్రాఫిక్ వాహనం వెళ్తున్నా ఎవరూ కాపాడలేకపోతున్నారు. అదే సీ త్రూ విండోస్ ఉంటే... కిడ్నాప్ లు జరగవు అని కోర్టు ఈ నిబంధన పెట్టి వాహనాలకు బ్లాక్ ఫిలిం తీయమని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫిలిం కారణంగా ఈ వాహనాలకు దానినితొలగిస్తే... అసలు కారవాన్ల ఉపయోగం ఏమిటి? అని అభిమానుల వాదన. సెల్రబిటీల ఆవేదన. అందుకే ప్రత్యేక రిజిస్ట్రేషన్ గా పరిగణించి కారవాన్లకు మినహాయిస్తే బాగుంటుందని అభిప్రాాయాలు వెలువడుతున్నాయి.