Talk: కామెడీకి కొదవలేదు, యాక్షన్ కి ఎదురులేదు

February 21, 2020

తెలుగు ప్రేక్షకుడు కోరుకునే అంశాలన్నీ మిక్సీలో వేసి తయారుచేసినట్టుగా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరును తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. పటాస్ సినిమాతోనే అనిల్ రావిపూడిలో కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అర్థమైంది. రవితేజ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సంక్రాంతికి వస్తున్న సరిలేరు నీకెవ్వరుల కూడా రైట్ ట్రాక్ లోనే నడుస్తున్నట్లు ట్రైలర్ చెబుతోంది.

మొదటి సినిమా నుంచి కూడా అనిల్ కామెడీని ఎంత బాగా పండిస్తాడో యాక్షన్ కూడా అంతే బాగా దట్టిస్తాడు. కామెడీలో కాంప్లికేషనే ఉండదు. చాలా సరదాగా అలా సాగిపోతుంది. కాకపోతే ఈ ట్రైలర్ చూస్తుంటే... రాజా ది గ్రేట్ లో హిట్ అయిన కొన్ని ఫార్ములాలు వాడినట్లు అర్థమవుతోంది. ఆ కామెడీకి సీక్వెల్ వంటి సీన్లు ఉన్నా అవి అనిల్ ఫ్రీ హ్యాండ్ తో చేసి ఉంటే కచ్చితంగా బొమ్మ హిట్టే అనుకోవాలి. ఇదంతా పక్కన పెడితే.. ప్రకాష్ రాజ్, విజయశాంతి మరోసారి స్ట్రాంగ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెర మీద కనిపిస్తోంది. మరి సంక్రాంతికి ప్రేక్షకులను నవ్విస్తారో, నిర్మాతలు ఏడుస్తారో చూద్దాం.