ఏపీ, తెలంగాణలో తిరిగే రైళ్లు ఇవే... మీ ట్రైనుందా ఇందులో?

June 03, 2020

60 రోజుల సుధీర్ఘ విరామం తర్వాత సాధారణ రైళ్లు మొదలవుతున్నాయి. జనం కోట్లాది మంది తమ స్వస్థలాలకు దూరంగా చిక్కుకుపోయి ఒంటరి జీవితం గడిపారు. సాధారణంగా పనిలో ఉంటే ఏడాది ఎడం వచ్చినా పెద్దగా బాధ ఉండదు. కానీ 24 గంటలు రెండు నెలల పాటు ఖాళీగా ఉండి... అది కూడా బంధువులకు దూరంగా ఉండటం ఎవరి వల్ల కాదు. అది నరకం.

ఈ నేపథ్యంలో  వేర్వేరు ప్రాంతాల్లో ఉండిపోయిన వారు తమ సొంతూళ్లకు వెళ్లే అవకాశం కేంద్రం కల్పిస్తూ రైళ్లను ప్రవేశ పెడుతోంది. అందరికీ కాస్త ఉపశమనం కలిగించే ప్రకటనను కేంద్రం వెల్లడించింది. మే 25 నుంచి దేశీయంగా పౌర విమానయాన సేవలు స్టార్ట్ కానున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ఏర్పాట్లు చేసుకోవాలని విమాన సంస్థలు, ఎయిర్ పోర్టులకు ఆయన సూచించారు. 

ఈ నెల 25 నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాలు తిరుగుతాయి.సామాన్య.. మధ్యతరగతి ప్రజలకు వీలుగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సాధారణ రైళ్లను కూడా జూన్ ఒకటి నుంచి నడపాలని  నిర్ణయించారు. ఇందుకు కేంద్రం ఓకే చెప్పింది. జూన్ ఒకటి నుంచి ప్రతిరోజు 200 రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది.

రోజువారీగా నడిపే శ్రామిక్ రైళ్లకు, ప్రత్యేక రైళ్లకు ఈ 200 రైళ్లు అదనం అన్నమాట.రైల్వేస్టేషన్లలో బుకింగ్ సౌకర్యం ఉండదు. ఆన్ లైన్ లోనే టికెట్లను కొనాలి. ఇదిలా ఉంటే ఈ 200 రైళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లు పన్నెండు ఉన్నాయి.  

తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల విషయానికి వస్తే..

ముంబయి-హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ (02701/02),
హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ ప్రెస్‌ (02703/04),
హైదరాబాద్‌- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ ప్రెస్‌ (02723/24),
దానాపూర్‌- సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02791/92),
విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్‌ ప్రెస్‌ 02805/06)
గుంటూరు- సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ ప్రెస్‌ (07201/02)
తిరుపతి- నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ ప్రెస్‌ (02793/94)
హైదరాబాద్‌- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ ప్రెస్‌ (02727/28)వీటితో పాటు వారానికి రెండు సార్లు నడిచే సికింద్రాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ దురంతో రైలు కూడా నడుస్తుంది. హౌరా-యశ్వంత్‌పూర్‌ (విజయవాడ మీదుగా) దురంతో ఎక్స్‌ ప్రెస్‌ (02245/46) (వారానికి ఐదు రోజులు)ముంబయి CST-భువనేశ్వర్‌ (సికింద్రాబాద్‌, విజయవాడ మీదుగా) కోణార్క్‌ ఎక్స్‌ ప్రెస్‌ (01019/20).. (ప్రతిరోజు) నడుస్తాయి. 

రైలు ఎక్కాలంటే ఈ రూల్స్ పాటించాలి.

90 నిమిషాలు ముందుగా స్టేసనుకు రావాలి.

భౌతిక దూరం పాటించాలి.

మాస్కు తప్పనిసరి

ఆరోగ్యంగా ఉన్నవారికే అనుమతి.

జనరల్ బోగీకి కూడా సీట్లు రిజర్వేషను కంపల్సరీ

తత్కాల్ టిక్కెట్లు ఉండవు

ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి

ఆహారం, నీళ్లు వెంట తెచ్చుకోవాలి.