మోడీ కోరిక తీరింది.. ఆ పనైపోయింది

August 08, 2020

ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ ప్రధాన ఉద్దేశంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయలో మోడ ీకోరిక నెరవేరింది. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ తక్కువగా ఉన్నా... బిల్లు 15 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందింది. యాటిజీట్ గా వైసీపీ, టీఆర్ఎస్ లు తమ సంపూర్ణ మద్దతును మోడీకి ప్రకటించాయి. ఇక రాష్ట్రపతి ముద్ర తరువాయి. ఎలాగూ ఇది మోడీకి ఇష్టమైన బిల్లు కాబట్టి అది కూడా జరిగిపోతుంది.  

ఇక పోతే.. ముస్లిం మహిళల హక్కులను కాపాడటమే కాదు, ముస్లిం జనాభాను కంట్రోల్ చేయడంలో ఇది మొదటి అడుగుగా భావించవచ్చు. ఎందుకంటే ముస్లింలకు అధిక వివాహాలు చేసుకునే అనుమతి ఉంది. వారికి పోషణ భారమైనపుడు తమకు నచ్చని భార్యలకు తలచినదే తడవుగా విడాకులు ఇచ్చేస్తున్నారు. తలాక్ విడాకుల వల్ల ముస్లిం మహిళలు రోడ్డున పడుతున్నారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఈ సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు లభించాయి. ఇటీవలే లోక్ సభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. 

కొసమెరుపు - ట్రిపుల్ తలాక్ పద్ధతిని కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మన పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో దీనిపై నిషేధం ఉన్నా... కేవలం రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు దీనిని వ్యతిరేకించడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017 లో చెప్పిన విషయం తెలిసిందే.