సరైన మగాడికోసం వెతుకుతోందట... ట్రై చేస్తారా?

August 05, 2020

వయసు మీద పడుతున్నా.. పెళ్లి లాంటివేమీ లేకుండా కాలం గడిపేసే సినీ ప్రముఖులు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు త్రిష. ఏళ్లకు ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఆమెకు తగినోడు మాత్రం దొరకలేదు. ఆ మధ్యలో ఒక బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్ మెంట్ కావటం.. పెళ్లికి రెఢీ అయిన ఆమె.. అంతలోనే పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత ఆమెతో పలువురు ప్రముఖులకు లింకు పెట్టినా.. అవన్ని ఉత్త వార్తలుగా మిగిలాయే కానీ.. ఏవీ సీరియస్ రిలేషన్ అన్న విషయాన్ని ధ్రువీకరించలేదు.
సుదీర్ఘంగా సాగుతున్న ఆమె కెరీర్.. ఇప్పటికే ఎలాంటి కుదుపులు లేకుండా సాగిపోవటం ఒక ఎత్తు అయితే.. పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు సక్సెస్ కాలేకపోతుందన్నది ప్రశ్నగా మారింది. త్రిష ఇంటర్వ్యూ ఇస్తుందంటే చాలు.. పెళ్లి ముచ్చట.. దాని మీద ప్రశ్నలు కామన్ గా మారాయి. అదే పనిగా అడిగిన ప్రశ్నలే అడగటం వల్లో.. మరో కారణమో కానీ.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం పెళ్లి మీద ఓపెన్ అయిపోయారు.
ఫుల్ క్లారిటీ ఇచ్చేలా మాట్లాడారు. ఇప్పటికిప్పుడు తనకు ఎలాంటి వాడు కావాలన్న విషయం మీద స్పష్టత ఇచ్చేశారు. తనకేమీ హీరోలా అందంగా ఉండేవాడు భర్తగా అక్కర్లేదని.. తనను బాగా చూసుకునేవాడు కావాలని చెప్పారు. అవసరమనుకుంటే రోజులో పెళ్లికి తాను రెఢీ అని ఆమె చెప్పటం గమనార్హం.
రేపు పెళ్లి చేసుకోవటానికైనా రెఢీగా ఉన్నానని.. కానీ సరైనవాడు దొరకాలి కదా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. లేకపోతే ఎలా పెళ్లి చేసుకుంటామన్న ఈ బ్యూటీ.. తనకు నలుపు అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరిని పెళ్లి చేసుకున్నా తన ఇష్టప్రకారమేనని చెప్పిన ఆమె.. ఇంట్లో వారి జోక్యం ఏమీ ఉండదన్న క్లారిటీ ఇచ్చేశారు. త్రిష లాంటి బ్యూటీ పెళ్లికి రెఢీ.. రంగుతోనూ.. అందంతోనూ సంబంధం లేకుండా ఆమెను మనసును గెలుచుకునేటోడే లేకపోయాడా?