కష్టపడి పని చేశాక.. పార్టీ ఎంతగా చేసుకోవాలో చెప్పేసింది

July 08, 2020

సక్సెస్ మూడక్షరాల పదమే అయినప్పటికీ దాన్ని అందుకోవటం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులే కాదు.. ఎంతో కష్టపడాలి. మామూలు సక్సెస్ కే అంత శ్రమ అవసరమైనప్పుడు.. సూపర్ సక్సెస్ సొంతం కావాలంటే శ్రమ మాత్రమే కాదు.. కాలం కూడా కలిసి రావాలి. ఇప్పుడు అలాంటి అనుభవమే ఎదురైంది అల వైకుంఠపురము టీంకు. సరైన సక్సెస్ లేక ఏడాదిన్నర పాటు ఒక అగ్ర నటుడు ఖాళీగా ఉండటానికి మించిన శిక్ష ఇంకేం ఉంటుంది. అగ్ర దర్శకుడిగా పేరున్నప్పటికీ.. దారుణమైన పరాజయపు పల్టీ కొట్టిన వేళ.. తానేమిటో ఫ్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిని త్రివిక్రమ్ ఎదుర్కొన్నారు.
ఇలా ఫెయిల్యూర్ ముద్ర పడిన ఇద్దరు కలిసిన కాంబినేషన్ లో సినిమా వస్తే.. దాని కోసం అహోరాత్రాలు కష్టపడితే.. వచ్చిన ఫలితం అల వైకుంఠపురములో సక్సెస్. రిలీజ్ అయిన ఒక్క రోజే అయినప్పటికీ.. సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్.. ఎక్కడ లేని కారణాలు చూపించి మరీ మార్కుల కోత పెట్టి చుక్కలు చూపించే సమీక్షకులు సైతం.. చెబుతున్న తీర్పులు అల వైకుంఠపురము దూకుడు ఇంకెవరూ నిలువరించే ఛాన్సే లేదన్నట్లుగా మారింది.
ఇలాంటివేళ.. చక్కటి పార్టీ చేసుకోకుండా ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు త్రివిక్రమ్ టీం మొత్తం ఫుల్ జోష్ లో ఉంది. పార్టీతో ఎంజాయ్ మూడ్ లో ఉంది. తాజాగా చిత్రసక్సెస్ నేపథ్యంలో తమ పార్టీ పిక్ ను షేర్ చేశారు చిత్ర కథానాయకి పూజహెగ్డే. తాజాగా తాను పెట్టిన పోస్టు కింద తన కామెంట్ లో.. పార్టీ టైం.. ఎంత కష్టపడతామో.. అంతకంటే ఎక్కువగా పార్టీ చేసుకోవాలన్న బుజ్జి సందేశాన్ని ఇచ్చేసింది. విజేతలు ఇచ్చే సందేశం ఏదైనా సరే.. ఫాలో కావాల్సిందే.

 

Read Also

‘అల వైకుంఠపురములో’ రివ్యూ
రాసలీలల కేసు - పృథ్వి అడ్డంగా బుక్ అటగా...
లాజిక్‌తో ఫుట్‌బాల్ ఆడుకున్న రావిపూడి