కాలువలో దూకిన తెలంగాణ ఎమ్మెల్యే

June 04, 2020

కంగారు పడకండి. ఇదేం ఆత్మహత్య ప్రయత్నం కాదు. సంబరం. సిద్ధిపేట జిల్లాలో రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ కి నీటి విడుదల కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. పూజల అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజా, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసలే ఎండాకాలం కావడంతో వీరంతా జలకాలాడారు. కొందరని హరీష్ రావే సరదాగా నీటిలోకి తోసేశారు. అందరూ కలిసి ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం వారు జలకాలాడుతూ సరదాగా గడిపారు.

కార్యక్రమంలో హరీష్ మాట్లాడుతూ ఇంతకాలం రైతులు ఎపుడు వస్తాయో తెలియని వానలు ఆధారంగా పంటలు వేసి అప్పులు పాలు అయ్యారని... లక్షల ఎకరాలను ఈనాడు మాగాణి చేసుకున్నామని... గుండెల మీద చేయి వేసుకుని పంటల పెట్టుకోవచ్చన్నారు. ఈరోజు కోసమే రైతన్న ఎదురుచూశారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

English note: TRS MLA, Minister Harish rao opens water into mallanna sagar tunnel. After this inauguration TRS leaders swims in that canal amid hot summer