TRS పై ఫుల్ ట్రోలింగ్, ఎందుకంటే

August 15, 2020

తనంతట మొనగాడే లేడని చెప్పుకునే కేసీఆర్ మొదటి టర్ములో, కేసీఆర్ రెండో టెర్ములో చేసిన పార్టీ ఫిరాయింపులు. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటే నిద్రపట్టదు కాబట్టి ఫిరాయింపులను ప్రోత్సహించారు. దీనికి ఆయన ముద్దుగా పెట్టుకున్న పేరు అభివృద్ధి చేరికలు. ఇపుడు అదే కామెంట్ తో జనం టీఆర్ఎస్ ను ట్రోల్ చేస్తున్నారు.

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి

గణేష్ గుప్తా

వీరంతా కరోనా సోకిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ద్వారానే ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా సోకడం గమనార్హం. కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే కరోనా సోకడంతో టీఆర్ఎస్ గురించి ఒక కామెంట్ బాగా ట్రోలింగ్ అవుతోంది. 

’’బ్రేకింగ్ న్యూస్ : తెరాస పార్టీలో చేరిన కరోనా, కేసీఆర్ అభివృద్ధి చూసి టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటన‘‘ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఎక్కడో పుట్టి ... అన్ని ఊర్లకు వచ్చేసిన కరోనా అందరినీ దడదడలాడిస్తోంది. ఇపుడు తెలంగాణలో రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. దేశమంతటా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అయితే, టెస్టులు తక్కువగా చేసిన తెలంగాణ ప్రభుత్వం వ్యాప్తి పెరగడానికి కారణమైందని అందరూ ఆరోపిస్తున్నారు.