టీఆర్ఎస్ లో తిరుగుబాట్లు... బుజ్జగింపులుంటాయా?

January 22, 2020

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ తీవ్ర ప్ర‌కంప‌నలు రేపుతోంది. మంత్రి వ‌ర్గంలో ఆశావాహులు ఎక్కువుగా ఉండ‌డంతో కేసీఆర్ అంద‌రికి న్యాయం చేయ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు అల‌క‌బూన‌గా... మ‌రికొంద‌రు త‌మ అసంతృప్తి ఓపెన్‌గానే వ్య‌క్తం చేస్తున్నారు. నాయిని న‌ర్సింహారెడ్డి కేసీఆర్ త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి మాట త‌ప్పార‌ని ఫైర్ అవ్వ‌గా.. కేబినెట్లో మాదిగ‌ల‌కు చోటు లేక‌పోవ‌డంపై మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటికొండ రాజ‌య్య అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామ‌న్న రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. సోమవారం ఉదయం నుంచి రామన్న ఫోన్ స్విచ్చాఫ్ అయింది. తన గన్ మెన్లను వదిలిపెట్టి ఒంటరిగా వెళ్లిపోయారు. ఫోన్‌కు కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు రామ‌న్న కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఇక రామ‌న్న ఇంటి ద‌గ్ద‌ర ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆయ‌న అనుచ‌రుడు ఒక‌రు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. రామ‌న్న కేసీఆర్ తొలి కేబినెట్లో బీసీ సంక్షేమం, అట‌వీ శాఖ చూశారు. మున్నూరు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌కు మ‌ళ్లీ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఇదే వ‌ర్గం నుంచి క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్ రామ‌న్న‌ను ప‌క్క‌న పెట్టారు.

ఒక్క ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాకే నాలుగు మంత్రి ప‌ద‌వులు ఎలా ఇస్తార‌నేది గులాబీ ద‌ళంలో విన్పిస్తున్న ప్ర‌శ్న‌. మున్నూరు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ను ఎదుర్కొనేందుకు గంగుల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే... ఆదిలాబాద్‌లోనూ బీజేపీ దూసుకుపోతోంద‌ని... ఇక్క‌డ కూడా ఆ పార్టీని ఎదుర్కోవాలంటే రామ‌న్న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి ? క‌దా ? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా రామ‌న్న ఎక్క‌డ ఉన్నారో బ‌య‌ట‌కు వ‌స్తే కాని తెలియ‌ని ప‌రిస్థితి.

ఇక రామ‌న్న‌తో పాటు మాజీ మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌ పద్మా దేవేందర్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌‌‌‌, రెడ్యానాయక్‌‌‌‌, ఆరూరి రమేశ్‌‌‌‌‌తో పాటు పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించి భంగ‌ప‌డ్డారు. 

ఇంతకాలం తాను చెప్పిందే జరగాలి, ఎవరూ ప్రశ్నించకూడదు అన్న ధోరణిలో టీఆర్ఎస్ రాజకీయం సాగేది. కానీ తాజాగా టీఆర్ఎస్ లోధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం ఇంకో ఆప్షన్ లేక ఏం చేసినా పార్టీలో పడి ఉండాలి.. అనుకునే దశ నుంచి బీజేపీ అని ప్రత్యామ్నాయం కనిపిస్తుండటం వల్లే పడిఉండాల్సిన అవసరం లేదని క్యాడర్ భావిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది కేసీఆర్ కు కూడా కొంత అర్థమైంది. మొన్నటి యాదాద్రి శిల్పాలతో... కేసీఆర్ కు వెన్నులో వణుకు పుట్టి 24 గంటల్లో వాటిని చెరిపేశారు. గతంలో టీఆర్ఎస్ లో ఈ ధోరణి కనిపించేది కాదు. అదే క్రమంలో బీజేపీ పార్టీని లూటీ చేయకుండా... బుజ్జగింపులు చేస్తారా లేదా అన్నది అనుమానమే.

Read Also

సూపర్ ఫాస్ట్ గా చంద్రబాబు 
స్కిన్నీ డ్రెస్... ఈషారెబ్బా లేటెస్ట్ ఫొటోలు
వాడు.. ఆథరైజ్డ్ డ్రింకర్ అట !!