సార్ ప్లాన్ గట్టిగా రివర్స్ అవుతోందిగా!

July 05, 2020

కేసీఆర్‌కు ఉప ఎన్నిక‌లు ఎప్పుడు అండ‌గా ఉంటూ వ‌స్తున్నాయి. ఎప్పుడు ఉప ఎన్నికలు జ‌రిగినా వాటిలో విజ‌యం కేసీఆర్‌నే వ‌రిస్తూ, ఇత‌ర పార్టీల ఉనికినే దెబ్బ‌తీసేవి. కాని ఇప్పుడు కేసీఆర్‌కు మొద‌టిసారిగా ఉప ఎన్నిక‌ల్లో పెద్ద దెబ్బ త‌గుల‌నున్న‌దా.. అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తుందట ప్ర‌జ‌ల నుంచి.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి శానంపూడి సైదిరెడ్డికి మ‌రోమారు ఓట‌మి త‌ప్పేలా లేదు అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇంత‌కు కేసీఆర్‌కు అంత పెద్ద దెబ్బ త‌గ‌లడానికి ప్ర‌ధాన కార‌ణం ఆర్టీసీ స‌మ్మె ఎఫెక్ట్ అని అంటున్నారు ప‌రిశీల‌కులు.
కేసీఆర్ ఉద్య‌మాల నుంచి వ‌చ్చిన నేత‌. ఆయ‌న ఉద్య‌మాల ద్వారానే సీఎం సీటు ఎక్కారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకు కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జ‌లు కూడా ఆలోచ‌న‌ల్లో ప‌డిర బాట వాస్త‌వం. తెలంగాణ ప్ర‌జ‌లు అస‌లే నియంతృత్వాన్ని స‌హించ‌లేరు. కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకున్న నాలుగు నెల‌ల్లోనే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలా కింద‌కు దింపేశారో చూశాం. విభ‌జించి పాలించు అనే సూత్రాన్ని కేసీఆర్ పాటిస్తున్నాడ‌ని ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ట‌. అందుకే హుజూర్‌న‌గ‌ర్‌లో కేసీఆర్‌కు జీ హుజూర్ అన‌కుండా.. నై హుజూర్ అనేలా ఉన్నార‌ట ప్ర‌జ‌లు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మె ఎఫెక్ట్ హుజూర్‌న‌గ‌ర్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ట‌.
అక్క‌డ టీ ఆర్ ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌రుగుతున్నా, పార్టీ చేస్తున్న ప్ర‌చారంకు పెద్ద ఎత్తున స్పంద‌న క‌నిపిస్తున్నా ఎందుకో తేడా కొడుతోంద‌న్న‌ది మాత్రం పార్టీ నాయ‌క‌త్వాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఆర్టీసీ స‌మ్మెతో ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తికి క‌లిసొచ్చెలా క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌కు టీజెఎస్‌, తెలంగాణ ఇంటిపార్టీ, టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. టీ ఆర్ ఎస్‌కు వైసీపీ, సీపీఐ మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. ఇక సీపీఎం ఎటు కాకుండా గోడ‌మీద పిల్లి వాటం ప్ర‌ద‌ర్శిస్తోంది. కానీ టీ ఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని మాత్రం స్పష్టం చేశారు ఆ పార్టీ కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం.
ఇక పోటీలో ఉన్న 28 మంది అభ్య‌ర్థుల్లో పోటీ ప్ర‌ధానంగా టీ ఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థుల మ‌ధ్యే ఉంది. ఇక ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, ప్ర‌భుత్వ ఉద్యోగుల కుటుంబాలు కేసీఆర్‌కు క‌ర్రుకాల్చి వాత పెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. అందుకే ఇప్పుడు ఆర్టీసీ స‌మ్మె రూపంలో కేసీఆర్‌కు పెద్ద ప్ర‌మాదం పొంచి ఉంద‌నేది టాక్‌. చూడాలి మ‌రి జ‌నాలు ఎటువైపు మొగ్గుతారో.. తక్క‌డ‌లో ఎవ‌రి బ‌రువు ఎంత తూగుతుందో అటే గెలుపు అవ‌కాశాలు లేక‌పోలేదు.